Vice President: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు భారత్ బయోటెక్ సందర్శన.. ఆసక్తికర కామెంట్లు.!
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుక్రవారం హైదరాబాద్ జినోమ్‌వ్యాలీలోని భారత్ బయోటెక్‌ను సందర్శించారు. జినోమ్ వ్యాలీలో..
Vice President Venkaiah Naidu – Bharat Biotech: భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుక్రవారం హైదరాబాద్ జినోమ్‌వ్యాలీలోని భారత్ బయోటెక్‌ను సందర్శించారు. జినోమ్ వ్యాలీలో అనేక సంస్థలు కొలువుదీరాయని, హైదరాబాద్ బయో టెక్నాలజీ హబ్‌గా మారుతోందన్నారు. భారత్ బయోటెక్‌ను సందర్శించడం సంతోషంగా ఉందన్నారాయన.
ఇప్పటికీ కరోనా వ్యాక్సిన్ అంటే చాలా మందికి భయం ఉందనీ.. వారందరూ ఎందుకు భయపడుతున్నారో అర్దం కావడం లేదన్నారు ఉపరాష్ట్రపతి. వ్యాక్సిన్లపై అవగాహన కల్పించడంలో మీడియా కీలక పాత్ర పోషించిందని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. కరోనా వంటి పాండమిక్ సిచ్యువేషన్‌లో మన ఫార్మా కంపెనీలు అద్భుతంగా పనిచేశాయని ఉపరాష్ట్రపతి కొనియాడారు.
ఒక్క ‘భారత్ బయోటెక్ 16 రకాల వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తోందన్నారు ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు. ఇప్పటి వరకు నాలుగు బిలియన్ల టీకాలు పంపిణీ చేసిందని ఆయన తెలిపారు. మన శాస్త్రవేత్తలు అనేక దేశాల ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారని కొనియాడారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
Vice President’s visit to Bharat Biotech facility in Hyderabad… some glimpses! #BharatBiotech pic.twitter.com/scDeWN2vBB
— Vice President of India (@VPSecretariat) July 30, 2021