Hanuman Birthplace: హనుమంతుని జన్మస్థలం అంజనాద్రి అనే అంశంపై తిరుమ‌ల‌లో అంత‌ర్జాతీయ వెబినార్‌.. ఆసక్తికర విషయాలు

రామదూత, అతులిత బలధామ హనుమంతుని జన్మస్థలం అంజనాద్రి అనే అంశంపై దేవదేవుని సన్నిధానం తిరుమలలో అంత‌ర్జాతీయ వెబినార్‌ జరిగింది...

Hanuman Birthplace: హనుమంతుని జన్మస్థలం అంజనాద్రి అనే అంశంపై తిరుమ‌ల‌లో అంత‌ర్జాతీయ వెబినార్‌.. ఆసక్తికర విషయాలు
Hanuman
Follow us
Venkata Narayana

|

Updated on: Jul 30, 2021 | 6:41 PM

Hanuman Birthplace – Tirumala: రామదూత, అతులిత బలధామ హనుమంతుని జన్మస్థలం అంజనాద్రి అనే అంశంపై దేవదేవుని సన్నిధానం తిరుమలలో అంత‌ర్జాతీయ వెబినార్‌ జరిగింది. వెబినార్‌లో పలువురు ప్రఖ్యాత స్వామిజీలు, పండితులు పాల్గొన్నారు. తిరుమలలోని అంజనాద్రి పర్వతమే హ‌నుమంతుడి జన్మస్థలమని వాల్మీకి రామాయణంలో స్పష్టంగా ఉందని ఈ సందర్భంగా పండితులు చెప్పారు.

హనుమంతుని జన్మస్థలం ఏదన్నదాని విషయంలో ఎలాంటి సందేహం, వివాదం అవసరమే లేదని పండితవర్గం పేర్కొంది. శాస్త్రాలు తెలియని వారికి ఇలాంటి విషయాల గురించి మాట్లాడే అర్హత లేదని కుర్తాళం సిద్ధేశ్వరీ పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వ్యాఖ్యానించారు. భ‌క్తుల నుండి విజ్ఞప్తులు రావ‌డంతో హ‌నుమ జ‌న్మస్థలంపై ఇవాళ తిరుపతిలో టీటీడీ పండిత పరిషత్ ఏర్పాటు చేసింది.

పురాణ, ఇతిహాస, భౌగోళిక, పురావస్తు అంశాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశోధించి అంజనాద్రి హనుమంతుని జన్మస్థలమని పండిత ప‌రిష‌త్‌ ఈ భేటీలో నిర్ధారించింది. “ఒకరిద్దరు అభ్యంతరాలు తెలపడానికి వస్తే చర్చపెట్టాం.. వారు మాట్లాడిన భాష, వ్యవహరించిన తీరు చాలా అభ్యంతరకరంగా ఉండ‌టంతో మ‌రోసారి చ‌ర్చించ‌లేదు” అని అంతర్జాతీయ వెబినార్‌లో టీటీడీ ఈవో జ‌వ‌హార్ రెడ్డి స్పష్టం చేశారు.

Read also : Peddireddy: టీఆర్ఎస్‌లో చేరిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి.. కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం కేసీఆర్