AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Account: ఎస్‌బీఐలో ఈ అకౌంట్‌ ఓపెన్‌ చేస్తే ఎన్నో లాభాలు.. లోన్‌ సదుపాయం కూడా.. అధిక వడ్డీ

స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా (SBI) కస్టమర్లకు ఎన్నో ఆఫర్లను అందుబాటులోకి తెస్తుంటుంది. వడ్డీ రేటు, బ్యాంకులో పెట్టుబడులపై రాబడి విషయంలో, వినియోగదారులకు మేలు..

SBI Account: ఎస్‌బీఐలో ఈ అకౌంట్‌ ఓపెన్‌ చేస్తే ఎన్నో లాభాలు.. లోన్‌ సదుపాయం కూడా.. అధిక వడ్డీ
Follow us
Subhash Goud

|

Updated on: Jul 30, 2021 | 5:55 AM

స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా (SBI) కస్టమర్లకు ఎన్నో ఆఫర్లను అందుబాటులోకి తెస్తుంటుంది. వడ్డీ రేటు, బ్యాంకులో పెట్టుబడులపై రాబడి విషయంలో, వినియోగదారులకు మేలు కలిగించే ఇతర స్కీమ్‌లు, అకౌంట్లను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. ఇక ఎస్‌బీఐ సేవింగ్ ప్లస్ అకౌంట్ పేరుతో ఓ కొత్త సర్వీస్ అందిస్తోంది. సాధారణ అకౌంట్‌తో పోలిస్తే ఎస్‌బీఐ సేవింగ్ ప్లస్ అకౌంట్ ద్వారా వచ్చే లాభాలు అధికమనే చెప్పాలి. సాధారణ సేవింగ్స్ అకౌంట్‌లో ఖాతాదారులు దాచుకునే డబ్బులకు 2.7 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. ఎస్‌బీఐ సేవింగ్ ప్లస్ అకౌంట్‌ వినియోగదారులు సేవింగ్స్ బ్యాలెన్స్‌పై ఎక్కువ వడ్డీ పొందే అవకాశం ఉంటుంది. ఈ ఖాతా మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్‌కు లింక్ అయి ఉంటుంది. మీ ఖాతాలో మీకు ఇప్పట్లో అవసరం లేని డబ్బులు ఉంటే ఆ మొత్తానికి ఎక్కువ వడ్డీ పొందవచ్చు. ఆ డబ్బులు ఆటోమెటిక్‌గా టర్మ్ డిపాజిట్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ అవుతాయి. మీకు అవసరం ఉన్నప్పుడు ఆ డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఖాతాలో ఉన్నన్ని రోజులు సాధారణ వడ్డీ కంటే ఎక్కువ పొందవచ్చు. మల్టీ ఆప్షన్‌ డిపాజిట్‌ స్కీమ్‌..

అయితే స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సేవింగ్‌ ప్లస్‌ ఖాతాలో రూ.35వేల కన్నా ఎక్కువగా ఉన్న డబ్బులు మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్‌లోకి వెళ్తాయి. మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్‌లోకి కనీసం రూ.10 వేలు జమ చేయాల్సి ఉంటుంది. ఉదాహారణకు చెప్పాలంటే.. మీ ఖాతాలో రూ.45 వేలు ఉంటే రూ.10 వేలు, రూ.50 వేలు ఉంటే ఉంటే రూ.15 వేలు మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్‌లో జమ అవుతాయి. ఈ మొత్తానికి అధిక వడ్డీ పొందే అవకాశం ఉంటుంది. ఈ అకౌంట్ తీసుకున్నవారికి సాధారణ సేవింగ్స్ ఖాతాలో లభించే ఏటీఎం కార్డులు, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ అలర్ట్స్ లాంటి సదుపాయాలన్నీ ఉంటాయి. ప్రతీ ఏడాది 25 చెక్స్ ఉన్న చెక్ బుక్ ఉచితంగా లభిస్తుంది.

లోన్‌ సదుపాయం:

ఈ మల్టీ డిపాజిట్‌ స్కీమ్‌ అకౌంట్‌కు లోన్‌ కూడా తీసుకునే వెసులుబాటు ఉంది. ఈ ఖాతాలో ఎంత బ్యాలెన్స్ అయినా మెయింటైన్ చేయవచ్చు. ఏ ఎస్‌బీఐ బ్రాంచ్‌లో అయినా ఈ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. అవసరమైన కేవైసీ డాక్యుమెంట్స్ ఉంటే చాలు. వ్యక్తిగతంగా, జాయింట్‌గా ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఈ అకౌంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://bank.sbi/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

ఇవీ కూడా చదవండి

IRCTC: ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ఆఫర్‌.. ఉచితంగా లక్ష రూపాయల వరకు గెలుచుకునే అవకాశం..!

Gas Cylinder Offer: గ్యాస్‌ సిలిండర్‌ కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌.. ఈ బ్యాంక్‌ నుంచి క్యాష్‌బ్యాక్‌..!

NPS Scheme: ఎన్‌పీఎస్‌ స్కీమ్‌లో చేరిన వారికి గుడ్‌న్యూస్‌.. కొత్త సేవలు అందుబాటులోకి..!