Silver Price Today: దేశీయంగా పరుగులు పెట్టిన వెండి ధరలు.. హైదరాబాద్‌లో మాత్రం భారీగా తగ్గింది..!
Silver Price Today: ఓవైపు బంగారం ధరలు పరుగులు పెడుతుంటే.. మరో వైపు అదే బాటలో వెండి కూడా పరుగులు పెడుతోంది. ధరల పెరుగుదలతో బంగారం, వెండి కొనుగోలు..
Silver Price Today: ఓవైపు బంగారం ధరలు పరుగులు పెడుతుంటే.. మరో వైపు అదే బాటలో వెండి కూడా పరుగులు పెడుతోంది. ధరల పెరుగుదలతో బంగారం, వెండి కొనుగోలు చేసేవారికి భారంగా ఉన్నా.. కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. నిన్న బంగారం పెరిగితే.. నేల చూపుతు చూసిన వెండి.. తాజాగా భారీగా పెరిగింది. దేశీయంగా పరిశీలిస్తే కిలో వెండిపై రూ.800 వరకు ఎగబాకింది. అయితే ఇంకో విషయం ఏంటంటే దేశీయంగా ప్రధాన నగరాల్లో సిల్వర్ పెరిగితే.. హైదరాబాద్ నగరంలో మాత్రం భారీగా తగ్గింది. కిలో బంగారం ధరపై రూ.4,200 వరకు తగ్గుముఖం పట్టింది. ఇక శుక్రవారం ఉదయం 6 గంటల సమయానికి దేశీయంగా ప్రధాన నగరాల్లో ఉన్న ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.67,200 ఉండగా, చెన్నైలో రూ.72,200 ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ.67,200 ఉండగా, కోల్‌కతాలో రూ.67,200 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.67,200 ఉండగా, కేరళలో రూ.72,200 వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.67,200 ఉండగా, విజయవాడలో రూ. 72,200 ఉంది.