Posani Krishna Murali: ప్రముఖ నటుడు పోసాని కృష్ణమూరళీకి కరోనా పాజిటివ్‌.. వాయిదా పడ్డ సినిమా షూటింగ్‌లు

Posani Krishna Murali: కరోనా మహమ్మారి సామాన్యుల నుంచి సెలబ్రేటీల వరకు ఎవ్వరిని వదిలి పెట్టడం లేదు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యల వల్ల పాజిటివ్‌ కేసుల సంఖ్య...

Posani Krishna Murali: ప్రముఖ నటుడు పోసాని కృష్ణమూరళీకి కరోనా పాజిటివ్‌.. వాయిదా పడ్డ  సినిమా షూటింగ్‌లు
Posani Krishna Murali
Follow us

|

Updated on: Jul 30, 2021 | 3:20 AM

Posani Krishna Murali: కరోనా మహమ్మారి సామాన్యుల నుంచి సెలబ్రేటీల వరకు ఎవ్వరిని వదిలి పెట్టడం లేదు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యల వల్ల పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఇక సినీ ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. ఇక తాజాగా ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళీకి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. తనతో పాటు తన కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు పోసాని కృష్ణమూరళీ తెలిపారు. ప్రస్తుతం పోసాని గచ్చిబౌళి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కోవిడ్‌ పాజిటివ్‌ రావడం వల్ల రెండు సినిమాల షూటింగ్‌లు వాయిదా పడినట్లు తెలిపారు. తన వల్ల అసౌకర్యానికి గురైన డైరెకక్టర్‌, నిర్మాతలు, హీరోలు క్షమించాలని ఆయన కోరారు. మీ అందరి ఆశీస్సులతో త్వరగా కోలుకుని షూటింగ్‌లో పాల్గొంటానని పోసాని ఓ ప్రకటనలో తెలిపారు.

ఇవీ కూడా చదవండి

Tokyo: టోక్యోలో కరోనా విలయతాండవం.. రికార్డు స్థాయిలో నమోదు అవుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు

Covid 19: దేశవ్యాప్తంగా మరోసారి పెరుగుతున్న కరోనా కేసులు.. రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కీలక సూచనలు..!