AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid 19: దేశవ్యాప్తంగా మరోసారి పెరుగుతున్న కరోనా కేసులు.. రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కీలక సూచనలు..!

దేశంలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి.. మరింతగా పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం దేశంలోని 12 రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులు అధికమవుతున్నాయని తెలిపింది.

Covid 19: దేశవ్యాప్తంగా మరోసారి పెరుగుతున్న కరోనా కేసులు.. రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కీలక సూచనలు..!
Corona
Balaraju Goud
|

Updated on: Jul 29, 2021 | 8:15 PM

Share

Covid 19 Third Wave: దేశంలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి.. మరింతగా పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం దేశంలోని 12 రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులు అధికమవుతున్నాయని తెలిపింది. మహారాష్ట్రలో స్వల్పంగా కరోనా కేసులు క్రమంగా తగ్గుతుండగా.. బెంగళూరు, చెన్నై నగరాల్లో కరోనా కేసులు భారీగా పెరగడం ఆందోళన కలగిస్తోందన్నారు. జనం మాత్రం అన్నీజాగ్రత్తలను గాలికి కొదిలేశారు. కరోనా ఉందన్న విషయాన్నే మర్చిపోయి, రెగ్యులర్‌ లైఫ్‌ లీడ్ చేస్తున్నారు. రాష్ట్రాల్లో పరిస్థితిని చూసి కేంద్ర ఆరోగ్యశాఖ ఆశ్చర్యపోతోంది. అన్నీ రాష్ట్రాలు అప్రమత్తంగా లేకపోతే.. థర్డ్ వేవ్ తప్పదని హెచ్చరిస్తోంది..

కోవిడ్ నియంత్రణలో భాగంగా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రభావ వంతమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేశారు. కోవిడ్ కేసులు ఉప్పెనలా పెరుగుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని.. పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కఠినమైన ఆంక్షలు అమలు చేయడంతో పాటుగా, నియంత్రణ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కరోనా నియత్రంణ కోసం ప్రత్యేకించిన జిల్లాలు, నగరాలు, వార్డుల వారీగా దృష్టి సారించాల్సి ఉంటుందని

దేశంలో కరోనా ఉధృతి మళ్లీ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 43 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. 24 గంటల్లో 640 మంది కోవిడ్‌తో మృతి చెందారు. కేసులు పెరిగిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. అయా రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు మరోసారి పలు కీలక సూచనలు చేసింది. కొత్తగా నమోదైన 43వేల కేసుల్లో ఒక్క కేరళ నుంచే 22 వేల పాజిటివ్ కేసులు రావడంతో ఉలిక్కిపడింది అక్కడి ప్రభుత్వం. కరోనా కట్టడి కోసం జూలై 31, ఆగస్టు 1 రెండ్రోజులపాటు రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్ విధించారు. మరో వైపు, పశ్చిమ బెంగాల్ కరోనా కేసులు పెరగడంతో ఆగస్టు 15 వరకు కొవిడ్ ఆంక్షలు పొడిగించారు. కేరళలో కేసులపై నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌కు చెందిన ఆరుగురు సభ్యుల బృందం.. పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడానికి గల కారణాలు తెలుసుకునేందుకు కేరళ వెళ్లింది. ఇక్కడ నమోదవుతున్న కేసుల్లో ఉన్న వేరియంట్‌ను గుర్తించేందుకు పరీక్షలు కూడా చేయనున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య తగ్గుతూనే ఉంది. తెలంగాణలో 657 కరోనా కేసులు నమోదైతే ఏపీలో కొత్తగా 2,107 కరోనా కేసులు వచ్చాయి. పాజిటివ్ రేటు గణనీయంగా తగ్గడంతో కరోనా ఆంక్షలను సడలించాయి రెండు ప్రభుత్వాలు. చాలా వాటికి సడలింపులు ఇచ్చాయి ప్రభుత్వాలు. ఇక స్కూళ్లు తెరిచే విషయంలో ఏపీ క్లారిటీ ఇచ్చినప్పటికి, తెలంగాణ ప్రభుత్వం మాత్రం తెరవాలా వద్దా అన్న డైలమాలో ఉంది.

కేసుల తీవ్రత ఇలా ఉంటే దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. దేశ వ్యాప్తంగా 45.7 కోట్లమందికి వ్యాక్సిన్ వేశామంటోంది కేంద్ర ఆరోగ్యశాఖ. గడిచిన 24 గంటల్లో 17 లక్షల మంది కొవిడ్ టెస్ట్‌లు నిర్వహించారు. ఇప్పటి వరకూ దేశంలో 46 కోట్ల 26 లక్షల 29 వేల 773 మందికి కోవిడ్ టెస్ట్‌లు చేశారు. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 97.38 శాతం ఉంది.

కరోనా కేసులు తగ్గుతున్నాయని.. జాగ్రత్తలు లేకుండా తిరగకూడదని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. మస్క్ మస్ట్ గా పెట్టుకోవాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలన్నారు. లేదంటే మరోసారి మనమే థర్డ్ వేవ్ రావడానికి అవకాశమించిన వాళ్లమవుతామన్నారు…థర్డ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు. రాబోయో మరికొన్ని నెలలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోక తప్పదంటున్నారు డాక్టర్లు, అధికారులు..

Read Also… 

PM Modi: మోడీజీ క్రేజే వేరప్పా.. ట్విటర్‌లో అరుదైన ఘనత సాధించిన నరేంద్రుడు..