Raj Kundra Case: నిజం నమ్మండి.. రాజ్ కుంద్రా అలాంటోడే.. సంచలన విషయాలు వెల్లడించిన షెర్లిన్ చోప్రా

Shaik Madarsaheb

Shaik Madarsaheb |

Updated on: Jul 29, 2021 | 8:22 PM

Sherlyn Chopra – Raj Kundra Case: బాలీవుడ్‌లో అశ్లీల వీడియోల వ్యవహారం ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను..

Raj Kundra Case: నిజం నమ్మండి.. రాజ్ కుంద్రా అలాంటోడే.. సంచలన విషయాలు వెల్లడించిన షెర్లిన్ చోప్రా
Sherlyn Chopra And Raj Kundra

Sherlyn Chopra – Raj Kundra Case: బాలీవుడ్‌లో అశ్లీల వీడియోల వ్యవహారం ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. కోర్టు రాజ్ కుంద్రాను 14 రోజుల జ్యూడిషియల్ కస్టడికి పంపింది. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. దీంతోపాటు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో నోటీసులు అందుకున్న మోడల్, నటి షెర్లిన్‌ చోప్రా తీవ్ర ఆరోపణలు చేసింది. రాజ్‌కుంద్రా ఒకానొక సమయంలో తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆమె పోలీసులకు పిర్యాదుచేసింది. తనతో బలవంతంగా పోర్న్ వీడియోలు చేయించారని తెలిపింది. నోటీసుల అనంతరం విచారణకు హాజరైన షెర్లిన్‌ చోప్రా.. క్రైం బ్రాంచ్ ఎదుట సంచలన విషయాలు వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో రాజ్‌కుంద్రాపై కేసు పెట్టడానికి గల కారణాన్ని క్రైం బ్రాంచ్ పోలీసులు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా షెర్లిన్ చోప్రా రాజ్ కుంద్రాకు సంబంధించిన పలు విషయాలను, కీలక ఆధారాలను వెల్లడించినట్లు సమాచారం.

2019 మార్చిలో బిజినెస్‌ మీటింగ్‌ కోసం రాజ్‌కుంద్రా, అతని టీమ్‌ని కలిశానని.. మీటింగ్‌ అనంతరం చాలా రోజుల తర్వాత రాజ్‌ కుంద్రా తన ఇంటికి వచ్చినట్లు పేర్కొంది. ఓ మెస్సేజ్‌ గురించి తనతో వాగ్వాదానికి దిగాడని, బలవంతంగా ముద్దు కూడా పెట్టినట్లు పోలీసులకు షెర్లిన్‌ చెప్పినట్లు తెలుస్తోంది. శిల్పాశెట్టితో సరైన సంబంధాల్లేవని.. ఇంట్లో ఇబ్బందికరంగా ఉంటుందని రాజ్‌ కుంద్రా తనతో అన్నాడని షెర్లిన్‌ విచారణలో చెప్పినట్లు విశ్వనీయ వర్గాల సమాచారం. ముద్దు పెట్టి అసభ్యంగా ప్రవర్తించడానికి యత్నించడంతో అక్కడి నుంచి పారిపోయినట్లు నటి షెర్లిన్ చోప్రా పేర్కొందని.. ప్రస్తుతం పలు వార్తా కథనాలు చక్కెర్లు కొడుతున్నాయి. దీంతోపాటు రాజ్ కుంద్రా, నటి గహనా వశిష్ట్ తనతో పోర్న్ వీడియోలు చేయించినట్లు క్రైం బ్రాంచ్ పోలీసులకు వెల్లడించిందని సమచారం.

Also Read:

Basavaraj Bommai: పెంపుడు శునకానికి కర్ణాటక సీఎం బొమ్మై కన్నీటి వీడ్కోలు.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..

ఇస్రో గూఢచర్యం కేసులో పాకిస్తాన్ ప్రమేయం.. కేరళ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో సీబీఐ అనుమానం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu