Monkeys Killed: దారుణం.. కోతులకు విషమిచ్చి.. ఆ తర్వాత గోనె సంచుల్లో కుక్కి..
Monkeys: ఇటీవల కాలంలో ఘోర సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కొంతమంది అందరూ అసహ్యించుకునేలా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ ఘటన మనుషు
Monkeys Killed: ఇటీవల కాలంలో ఘోర సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కొంతమంది అందరూ అసహ్యించుకునేలా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ ఘటన మనుషుల్లో మానవత్వ విలువలు తగ్గిపోతున్నాయని అనడానికి నిదర్శనంగా మారింది. కొంతమంది కనీస విచక్షణ మరిచి మూగజీవాల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. వానరాలకు విషం పెట్టి.. గోనె సంచుల్లో కుక్కి తీవ్రంగా చిత్రహింసలకు గురిచేశారు. ఈ ఘోర ఘటనలో 30 కోతులు మృతిచెందాయి. ఈ దారుణమైన సంఘటన కర్ణాటకలోని హసన్ జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హసన్ జిల్లా బెలూర్ తాలూకా చౌడనహళ్లి గ్రామం సమీపంలోని రోడ్డు పక్కన గురువారం ఉదయం కొన్ని గోనెసంచులు మూటలు కనిపించాయి. దీంతో కొంతమంది యువకులు వాటిని తెరిచి చూశారు. అందులో చాలా కోతులు కన్పించాయి. కొన్ని సంచుల్లో ఉన్న కోతులు మృతి చెంది ఉండగా.. మరికొన్ని తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ ఘటనలో మొత్తం 30 వానరాలు చనిపోగా.. మరో 20 గాయపడ్డయని పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత యువకులు.. పోలీసులకు సమాచారం అందించి గాయపడిన కోతులకు సపర్యలు చేసి నీరు తాగించారు.
అటవీ అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కోతులకు విషం పెట్టి, సంచుల్లో కుక్కారని పేర్కొంటున్నారు. ఆ తర్వాత సంచులపై బలంగా కొట్టినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే.. ఈ కోతులను వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చి పడేసినట్లు పేర్కొంటున్నారు. అయితే.. చనిపోయిన కోతులకు పోస్టుమార్టం నిర్వహించగా.. విషం ఆనవాళ్లు కన్పించినట్లు పోలీసులు తెలిపారు.
సున్నిత మనస్కులు ఇక్కడ జత చేసిన వీడియోను చూడకండి..
In an absolutely heinous act, more than 60 monkeys were poisoned, tied in bags and thrown on Sakleshpur Begur Crossroad in Hassan District, Karnataka. @moefcc @byadavbjp @aranya_kfd @CMofKarnataka pic.twitter.com/VqHv0Oew8v
— Randeep Hooda (@RandeepHooda) July 29, 2021
Also Read: