AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beggars: భిక్షగాళ్ల మధ్య పంపకాలలో తేడాలు రావడంతో.. ఊహించని పరిణామం

భిక్షగాళ్ల మధ్య పంపకాలలో తేడాలు రావడంతో పోగొట్టుకున్న నాలుగుతులాల బంగారు పుస్తెలతాడు సురక్షితంగా పోలీసుల చెంతకు చేరింది. ఈ ఘటన భాగ్యనగరం..

Beggars:  భిక్షగాళ్ల మధ్య పంపకాలలో తేడాలు రావడంతో.. ఊహించని పరిణామం
Gold Recovery From Beggers
Venkata Narayana
|

Updated on: Jul 29, 2021 | 9:13 PM

Share

Beggars – Charminar – Hyderabad: భిక్షగాళ్ల మధ్య పంపకాలలో తేడాలు రావడంతో పోగొట్టుకున్న నాలుగుతులాల బంగారు పుస్తెలతాడు సురక్షితంగా పోలీసుల చెంతకు చేరింది. ఈ ఘటన భాగ్యనగరం చార్మినార్ సాక్షిగా సంచలనం రేపింది. వివరాలలోకి వెళితే.. హైదరాబాద్ ఉప్పుగూడ తానాజీ నగర్‌కు చెందిన ప్రయివేట్ టీచర్ స్వాతి జూలై 25వ తేదీన తన యాక్టివా వాహనంపై పాతబస్తీలోని పలు అమ్మవారి ఆలయాలతో పాటు చార్మినార్​భాగ్యలక్ష్మి దేవాలయాన్ని సందర్శించారు. తిరిగి ఇంటికి వస్తున్న తరుణంలో మెడలో ఉన్న నాలుగుతులాల పుస్తల తాడు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన స్వాతి వెంటనే స్థానిక ఛత్రినాక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఉదంతంపై కేసును నమోదు చేసిన పోలీసులు స్థానికంగా ఉన్న ఆలయాల దగ్గరున్న సిసి కెమెరాలు పరిశీలించగా ఆమె చైన్​మెడలో ఉన్నట్లు గుర్తించారు. చివరగా చేరుకున్న చార్మినార్​భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర మిస్ అయిండొచ్చని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇది ఉలా ఉండగా చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద పలువురు భిక్షాటన చేస్తుంటారు. అందులో ఒకరికి నాలుగు తులాల పుస్తలతాడు దొరకడాన్ని మిగతా భిక్షగాళ్లు చూశారు. అయితే ష్​… గప్​ చుప్​ ఏదయినా ఉంటే మనం అందరం కలిసి పంచుకుందామని భిక్షగాళ్ల మధ్య ఒప్పందం కుదిరింది.

అయితే, వాళ్ల మధ్య పంపకాలలో విబేధాలు తలెత్తడంతో చైన్​ పంపకం పెండిగ్​ పడుతూ వచ్చింది. చివరికి వాళ్ల మధ్య గొడవలు తలెత్తడంతో ఒక భిక్షగాడు నాకు దొరకకున్నా సరే .. ఎవ్వరికి దక్కొద్దు అని చార్మినార్​ పోలీసులకు సమాచారం ఇవ్వగా అసలు విషయం వెలుగు లోకి వచ్చింది. వెంటనే భిక్షగాళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి నాలుగు తులాల పుస్తల తాడును స్వాధీనం చేసుకుని సదరు వస్తువు పోగొట్టుకున్న స్వాతి దంపతులకు అందజేశారు.

Read also : TIDCO Houses: 300 SFT కలిగిన టిడ్కో ఇళ్లను రూపాయికే లబ్ధిదారులకు అందించనున్నాం : బొత్స

ఉపాధి హామీ కూలీలకు కేంద్రం భారీ శుభవార్త.. వేతనాలు ఇక ముందుగానే..
ఉపాధి హామీ కూలీలకు కేంద్రం భారీ శుభవార్త.. వేతనాలు ఇక ముందుగానే..
షర్ట్ కాలర్ దగ్గర ఈ చిన్న బటన్ ఎంత పెద్ద పనిచేస్తుందో తెలిస్తే..
షర్ట్ కాలర్ దగ్గర ఈ చిన్న బటన్ ఎంత పెద్ద పనిచేస్తుందో తెలిస్తే..
టీమిండియా ఓటమికి స్కెచ్ వేసిన గంభీర్, గిల్ జోడీ..?
టీమిండియా ఓటమికి స్కెచ్ వేసిన గంభీర్, గిల్ జోడీ..?
బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా లేడీ టైగర్..
బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా లేడీ టైగర్..
Telangana: తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. ప్రైవేట్ స్కూల్ ఫీజుల..
Telangana: తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. ప్రైవేట్ స్కూల్ ఫీజుల..
ఉదయ్ కిరణ్‏తో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ?
ఉదయ్ కిరణ్‏తో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ?
పైసా పెట్టుబడి లేకుండా ఈ పని స్టార్ట్‌ చేయండి! నెలకు రూ.30 వేలు..
పైసా పెట్టుబడి లేకుండా ఈ పని స్టార్ట్‌ చేయండి! నెలకు రూ.30 వేలు..
ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఈ డైట్ ప్లాన్ మీ కోసమే
ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఈ డైట్ ప్లాన్ మీ కోసమే
టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..