AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tokyo: టోక్యోలో కరోనా విలయతాండవం.. రికార్డు స్థాయిలో నమోదు అవుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు

Tokyo Corona:గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. తీవ్రంగా వ్యాపిస్తున్న కోవిడ్‌ ఎందరినో బలి తీసుకుంది. ఇక టోక్యోలో ఒలింపిక్‌ క్రీడల నేపథ్యంలో..

Tokyo: టోక్యోలో కరోనా విలయతాండవం.. రికార్డు స్థాయిలో నమోదు అవుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు
Tokyo
Subhash Goud
|

Updated on: Jul 29, 2021 | 10:13 PM

Share

Tokyo Corona:గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. తీవ్రంగా వ్యాపిస్తున్న కోవిడ్‌ ఎందరినో బలి తీసుకుంది. ఇక టోక్యోలో ఒలింపిక్‌ క్రీడల నేపథ్యంలో వరుసగా మూడో రోజు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడంపై జపాన్‌ ప్రభుత్వ అధికర వర్గాలు ప్రజలను అప్రమత్తం చేస్తోంది. కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. కొత్తగా కేసులు టోక్యో లోనే కాకుండా దేశం మొత్తం మీద భారీగా పెరుగుతున్నాయని చీఫ్ కేబినెట్ సెక్రటరీ కట్సునొబొ కటో గురువారం మీడియాకు తెలిపారు. వారం క్రితం కన్నా రెట్టింపు సంఖ్యలో కేసులు నమోదు కాగా, బుధవారం 3177 కేసులు నమోదు కాగా, గురువారం 3885 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వెల్లడించారు. అయితే గత ఏడాది కరోనా ప్రారంభం కన్నా ఇది చాలా ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నట్టు తెలిపారు. ఇతర దేశాల కన్నా జపాన్ కరోనా కేసులను, మరణాలను చాలావరకు అదుపులో ఉంచుతోంది. కానీ గత ఏడు రోజులుగా సరాసరి కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీంతో జపాన్‌ ప్రభుత్వం ప్రజలను మరింత అప్రమత్తం చేస్తోంది.

ఇప్పుడు జాతీయ స్థాయిలో లక్ష మందికి 28 మంది వంతున అదే స్థాయిలో టోక్యోలో 88 మంది వంతున బాధితులు నమోదవుతున్నారని జపాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పుడు కేసులు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయని, ముఖ్యంగా ఒలింపిక్స్, సమ్మర్ వెకేషన్ ప్రధాన కారణమని ప్రభుత్వ ఉన్నత వైద్య సలహాదారు డాక్టర్ షింగెరు ఒమి పేర్కొన్నారు. ఒలింపిక్స్ ప్రారంభానికి ముందే జూలై 12 నుంచి కరోనా అత్యవసర నాలుగో దశలో టోక్యో ఉంది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్ల వద్దనే ఉండాలని ఆదేశాలు జారీ చేసినా.. నిబంధనలు పాటించకపోవడం వల్లే కేసులు పెరుగుతున్నాయనే వాదన ఉంది.

ఇద్దరు విదేశీ ఒలింపిక్ క్రీడాకారులు ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని, మరో 38 మంది నగరం లోని హోటళ్లలో ఐసొలేషన్‌లో ఉంటున్నారని అధికారులు పేర్కొన్నారు. అయితే ఒలింపిక్ క్రీడాకారుల నుంచి ప్రజలకు కరోనా వ్యాపిస్తున్నట్టు దాఖలాలు కనిపించడం లేదని జపాన్ మంత్రి టారో కొనో ఒక ఇంటర్వూలో వెల్లడించారు. బుధవారం నాడు జపాన్ మొత్తం మీద రికార్డు స్థాయిలో 9500 కేసులు నిర్ధారణ కాగా, మొత్తం కేసుల సంఖ్య 8,92,000 కు చేరుకుంది. దాదాపు 15,000 మంది మృతి చెందారు. ఈ కేసుల్లో బాధితులైన వారు 30 ఏళ్ల యువకులే ఎక్కువగా ఉన్నారు. బుధవారం నాటికి జపాన్ జనాభాలో 26.3 శాతం మందికి టీకాలు వేశారు.

ఇవీ కూడా చదవండి

Covid 19: దేశవ్యాప్తంగా మరోసారి పెరుగుతున్న కరోనా కేసులు.. రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కీలక సూచనలు..!

India Corona Cases: నిన్నటి కంటే ఇవాళ తగ్గింది.. దేశంలో కొత్తగా 43,509 కరోనా కేసుల సంఖ్య ఇలా..