AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC: ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ఆఫర్‌.. ఉచితంగా లక్ష రూపాయల వరకు గెలుచుకునే అవకాశం..!

IRCTC: ఇండియన్‌ రైల్వేకు చెందిన ఐఆర్‌సీటీసీ టికెట్ల బుకింగ్‌, ప్రయాణికులకు పుణ్యక్షేత్రాలకు సంబంధించిన ఆఫర్లే కాకుండా బహుమతులు గెలుచుకునే కార్యక్రమాలు సైతం..

IRCTC: ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ఆఫర్‌.. ఉచితంగా లక్ష రూపాయల వరకు గెలుచుకునే అవకాశం..!
Subhash Goud
| Edited By: |

Updated on: Jul 29, 2021 | 8:26 AM

Share

IRCTC: ఇండియన్‌ రైల్వేకు చెందిన ఐఆర్‌సీటీసీ టికెట్ల బుకింగ్‌, ప్రయాణికులకు పుణ్యక్షేత్రాలకు సంబంధించిన ఆఫర్లే కాకుండా బహుమతులు గెలుచుకునే కార్యక్రమాలు సైతం చేపడుతుంటుంది. ఇక  ట్రావెల్‌ చేసే వారికి ఓ బంపర్‌ ఆఫర్‌ అందుబాటులో ఉంది. ఇండియన్‌ రైల్వేకుచెందిన ఆన్‌లైన్‌ బుకింగ్‌ విభాగం ఐఆర్‌సీటీసీ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్‌ తీసుకువచ్చింది. ఇందులో మీరు లక్ష రూపాయల వరకు గెలుచుకునే అవకాశం ఉంటుంది. అయితే ఐఆర్‌సీటీసీ ప్రత్యేకమైన కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ట్విట్టర్ వేదికగా ఐఆర్‌సీటీసీ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ కాంటెస్ట్‌లో భాగంగా మీరు వీడియో చేయాల్సి ఉంటుంది. ఇండియన్ రైల్వేస్ మీద, లేదంటే రైల్వేస్‌కు సంబంధించిన టికెటింగ్, కేటరింగ్, టూరిజం, ఎయిర్, చాట్‌బాట్, టూరిస్ట్ ల మీద వీడియోలు చేయవచ్చు.

https://corover.ai/vlog/ లింక్ ద్వారా మీరు ఈ కాంటెస్ట్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆ అవకాశం ఆగస్ట్ 31 వరకే అందుబాటులో ఉంటుంది. పోటీలో టాప్ 3లో నిలిచిన వారికి బహుమతులు అందజేస్తారు. మొదటి విజేతకు రూ.లక్ష, సర్టిఫికెట్, ట్రోఫీ అందిస్తారు. సెకండ్ ప్లేస్‌లో ఉన్న వారికి రూ.50 వేలు, సర్టిఫికెట్, ట్రోఫీ అందిస్తారు. మూడో స్థానంలో నిలిచిన వారికి రూ.25 వేలు, సర్టిఫికెట్, ట్రోఫీ అందిస్తారు. అయితే ఇందులో దాదాపు 300 మందిని విజేతలుగా ప్రకటిస్తారు. మిగిలిన వారికి రూ.500 గిఫ్ట్ కార్డు, సర్టిఫికెట్ లభిస్తాయి. ఒక వ్యక్తి ఒకటి కన్నా ఎక్కువ వీడియోలు సమర్పించవచ్చు. ఎంపికైన వీడియోలు ఐఆర్‌సీటీసీ అధికారిక ఛానల్స్‌లో అప్‌లోడ్ చేస్తారు. వీడియో నిడివి కనీసం ఒక నిమిషం ఉండాలి.

ఇవీ కూడా చదవండి

LIC: అదిరిపోయే ఎల్‌ఐసీ పాలసీ.. ఈ ప్లాన్‌ తీసుకుంటే ప్రతియేటా 12 వేల వరకు పొందవచ్చు.. ఎలాగంటే..!

Royal Enfield Electra: సగం ధరకే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌.. రుణ సౌకర్యం కూడా అందుబాటులో..!

Follow Us
రష్మిక మందన్నాకు ఆ టాలీవుడ్ స్టార్ హీరో అన్నయ్య అవుతాడా?
రష్మిక మందన్నాకు ఆ టాలీవుడ్ స్టార్ హీరో అన్నయ్య అవుతాడా?
రాత్రంతా నిద్రపోయినా ఉదయం అలసటగా ఉంటోందా? ఈ ఆరోగ్య కారణాలే
రాత్రంతా నిద్రపోయినా ఉదయం అలసటగా ఉంటోందా? ఈ ఆరోగ్య కారణాలే
మొసళ్ల పండుగ ముందుంది.. గంభీర్.! వాటిని అస్సలు భూతంలా చూడొద్దు
మొసళ్ల పండుగ ముందుంది.. గంభీర్.! వాటిని అస్సలు భూతంలా చూడొద్దు
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. చేరేముందు అదిరే ట్విస్ట్
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. చేరేముందు అదిరే ట్విస్ట్
పెళ్లింట తీరని విషాదం.. తల్లి, కూతురు ఆత్మహత్య
పెళ్లింట తీరని విషాదం.. తల్లి, కూతురు ఆత్మహత్య
బాబోయ్‌ భయంకరం.. వ్యక్తిని బంతిలా గాలిలోకి ఎగరేసి, కాళ్లతో తొక్కి
బాబోయ్‌ భయంకరం.. వ్యక్తిని బంతిలా గాలిలోకి ఎగరేసి, కాళ్లతో తొక్కి
శేషాచలం అడవుల్లో అరుదైన ఆకుపచ్చ నాగుపాము.. వైరల్ అవుతున్న వీడియో
శేషాచలం అడవుల్లో అరుదైన ఆకుపచ్చ నాగుపాము.. వైరల్ అవుతున్న వీడియో
కెనాల్‌ను శుభ్రం చేస్తుండగా దూసుకొచ్చిన కొండ చెలువలు..!
కెనాల్‌ను శుభ్రం చేస్తుండగా దూసుకొచ్చిన కొండ చెలువలు..!
పెళ్లి చేసుకునే వారికి కొత్త టెన్షన్.. వాటితో సంబంధం లేదంటున్న
పెళ్లి చేసుకునే వారికి కొత్త టెన్షన్.. వాటితో సంబంధం లేదంటున్న
డీమార్ట్ బంపర్ ఆఫర్.. ఇండక్షన్ స్టవ్‌లపై అదిరిపోయే డిస్కౌంట్లు..
డీమార్ట్ బంపర్ ఆఫర్.. ఇండక్షన్ స్టవ్‌లపై అదిరిపోయే డిస్కౌంట్లు..