AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Score: మీరు క్రెడిట్‌ కార్డు.. రుణాలు తీసుకున్నారా..? మీ క్రెడిట్‌ స్కోర్‌పై ప్రభావం చూపే అంశాలివే..!

Credit Score: మీరు క్రెడిట్‌ కార్డులు వాడుతున్నారా..? లేక బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారా..? సమయానికి రుణాలు గానీ, క్రెడిట్‌ కార్డు బిల్లులు చెల్లించడం లేదా..? ఇలాంటి..

Credit Score: మీరు క్రెడిట్‌ కార్డు.. రుణాలు తీసుకున్నారా..? మీ క్రెడిట్‌ స్కోర్‌పై ప్రభావం చూపే అంశాలివే..!
Credit Score
Subhash Goud
| Edited By: Phani CH|

Updated on: Jul 31, 2021 | 7:41 AM

Share

Credit Score: మీరు క్రెడిట్‌ కార్డులు వాడుతున్నారా..? లేక బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారా..? సమయానికి రుణాలు గానీ, క్రెడిట్‌ కార్డు బిల్లులు చెల్లించడం లేదా..? ఇలాంటి వారు కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే. రుణాలు తీసుకున్న వారు, క్రెడిట్‌ కార్డు ఉపయోగిస్తున్నవారి క్రెడిట్‌ స్కోర్‌ అనేది చాలా ముఖ్యం. క్రెడిట్‌ స్కోర్‌ అనేది రుణగ్రహిత క్రెడిట్‌ విలువను సూచిస్తుంది. రుణాలుతీసుకున్న వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా క్రెడిట్‌ బ్యూరోలు క్రెడిట్‌ స్కోర్‌ అందిస్తాయి. క్రెడిట్ స్కోరు ఎక్కువగా ఉంటే, భవిష్యత్తులో త‌క్కువ రేట్ల‌తో రుణం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తక్కువ క్రెడిట్ స్కోరు ఉన్న రుణగ్రహీతలు అధిక రుణం ఉన్నవారు క్ర‌మంగా రుణాన్ని చెల్లించ‌క‌పోతే, బ్యాంకులు తక్కువ మొత్తంలో రుణాలు ఇచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు అధిక వడ్డీ రేట్లు వసూలు చేయవచ్చు. లేకపోతే బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు అంగీకరించకపోవచ్చు. ఇలా క్రెడిట్‌ స్కోర్‌ను బట్టి ఆయా బ్యాంకులు రుణాలు ఇస్తుంటాయి.

అందువల్ల, మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేసే అంశాల‌ గురించి జాగ్రత్తగా ఉండటం ఎంతో అవసరం. రుణం లేదా క్రెడిట్ కార్డ్ బకాయిలు స‌మ‌యానికి చెల్లించ‌క‌పోతే మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ, మీ స్కోర్‌ను ప్రభావితం చేసే అనేక ఇతర అంశాలు ఉన్నాయి. వాటిపై అంద‌రికీ అవ‌గాహ‌న త‌క్కువ‌గా ఉంటుంది. అవి ఏంటంటే..వేరొకరి రుణానికి మీరు హామీ ఇవ్వడం, మీ రుణాన్ని పునర్నిర్మించడం వంటివి.

అంతేకాకుండా కుటుంబ సభ్యులకు, బంధువుల‌కు హామీదారుగా ఉండ‌టం సర్వ సాధారణం. అయితే ఇలా తరచుగా చేయ‌డం వ‌ల‌న త‌మ క్రెడిట్ స్కోర్‌పై ప్ర‌భావం ప‌డుతుంద‌నే విషయం చాలా మందికి తెలిసి ఉండదు. ఒక వేళ కొందరికి తెలిసినా పెద్దగా పట్టించుకోరు. అలాంటి వారికి భవిష్యత్తులో రుణాల విషయంలో ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఇలా చేస్తే కొత్త‌ రుణాల కోసం మీ సొంత‌ అర్హత తగ్గడమే కాదు, అసలు రుణగ్రహీతకు బ‌కాయిలు ఉన్న‌ట్ల‌యితే మీరు కూడా నష్టపోవచ్చు. ఇలాంటి విషయాలను రుణాలు తీసుకున్న వారు, క్రెడిట్‌ కార్డులు తీసుకున్న వారు తప్పకుండా గుర్తించుకోవాల్సిన అంశం. ఏ మాత్రం అజాగ్రత్తగా వహిస్తే రుణాల విషయంలో ఇబ్బందులు పడే ప్రమాదం ఉంటందున్నారు నిపుణులు.

ఇవీ కూడా చదవండి:

SBI Car Loan: ఎస్‌బీఐ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. కారు లోన్‌పై వడ్డీ తగ్గింపు..!

SBI Account: ఎస్‌బీఐలో ఈ అకౌంట్‌ ఓపెన్‌ చేస్తే ఎన్నో లాభాలు.. లోన్‌ సదుపాయం కూడా.. అధిక వడ్డీ