Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PNB Pratibha Loan : పిఎన్‌బి ఎడ్యుకేషన్ లోన్‌కి ఎవరు అర్హులు..! ఎంత మొత్తం చెల్లిస్తారు.. పూర్తి వివరాలు

PNB Pratibha Loan : పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రత్యేక పథకం ద్వారా దేశంలోని ప్రతిష్టాత్మక కళాశాలల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు

PNB Pratibha Loan : పిఎన్‌బి ఎడ్యుకేషన్ లోన్‌కి ఎవరు అర్హులు..! ఎంత మొత్తం చెల్లిస్తారు.. పూర్తి వివరాలు
Education Loan
Follow us
uppula Raju

|

Updated on: Jul 30, 2021 | 1:39 PM

PNB Pratibha Loan : పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రత్యేక పథకం ద్వారా దేశంలోని ప్రతిష్టాత్మక కళాశాలల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తోంది. ఏ విద్యార్థి అయినా మంచి కళాశాలలో చదువుకోవాలనుకుంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా పర్వాలేదు. ఎందుకంటే PNB ప్రతిభా పథకం ద్వారా విద్యార్ధులకు రుణం మంజూరు చేస్తుంది. దీంతో వారు కలలను నెరవేర్చుకోవచ్చు. వాస్తవానికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ PNB ప్రతిభ పేరుతో ఒక పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా చదువుకునే పిల్లలకు విద్యారుణం అందిస్తుంది. అయితే దీనికి ఎవరు అర్హులు, లోన్ ఎలా పొందాలి తదితర వివరాలను తెలుసుకోండి.

చదువు కోసం రుణం ఎలా పొందాలి? ఈ పథకం ద్వారా పాఠశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలు, మెడికల్ కళాశాలలు వంటి అన్ని ప్రముఖ కళాశాలలకు రుణాలు అందిస్తుంది. ఇది కాకుండా లిస్టులో చాలా కళాశాలల పేర్లు ఉన్నాయి. వీటిలో రీసెర్చ్ కోసం రుణాలు అందిస్తుంది. ఈ సమాచారాన్ని మీరు బ్యాంక్ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా పొందవచ్చు.ఈ పథకం ద్వారా పిల్లలకు కళాశాల, పాఠశాల, హాస్టల్ ఫీజు చెల్లిస్తారు. ఇవి కాకుండా లైబ్రరీ, లాబొరేటరీ, ఎల్‌ఐసి, బిల్డింగ్ ఫండ్ మొదలైన వాటిని కూడా బ్యాంకు చెల్లిస్తుంది. అలాగే, విద్యార్థులు బ్యాంకు ఖర్చుతో పుస్తకాలు, యూనిఫాంలు, ఏదైనా సాంకేతిక వస్తువులు మొదలైనవి తీసుకోవచ్చు. రుణం తీసుకునే వ్యక్తి భారతదేశ పౌరుడిగా ఉండాలి. ఇది కాకుండా దేశంలోని ప్రముఖ కళాశాలల్లో ప్రవేశం పొందుతున్న విద్యార్థులకు రుణం అందిస్తారు. ఈ రుణం 15 సంవత్సరాలు తీసుకోవచ్చు. అలాగే స్టడీ పూర్తయిన తర్వాత కస్టమర్ దానిని చెల్లించాలి.

Kisan Credit Card : కిసాన్ క్రెడిట్ కార్డు ఇప్పుడు వీరికి కూడా..! కరోనా సమయంలో 2.10 లక్షల మంది రైతులు పొందారు..

Investments: ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడం కంటే..వీటిలో పెట్టుబడి సేఫ్ అంటున్నారు నిపుణులు అవేమిటో తెలుసుకోండి!

Viral Video: ‘దమ్మే కాదు దిమాక్ కూడా ఉండాలి’.. చిరుతతో ‘కోతి కొమ్మచ్చి’ ఆడిన వానరం..