Viral Video: ‘దమ్మే కాదు దిమాక్ కూడా ఉండాలి’.. చిరుతతో ‘కోతి కొమ్మచ్చి’ ఆడిన వానరం..

అడవిలో బలమైన జంతువుల లిస్టులో చిరుత టాప్-3 లో ఉంటుంది. నక్కి, నక్కి వేటాడటం, వెంటాడి చంపడం రెండూ దానికి తెలుసు....

Viral Video: 'దమ్మే కాదు దిమాక్ కూడా ఉండాలి'.. చిరుతతో 'కోతి కొమ్మచ్చి' ఆడిన వానరం..
Cheetah Vs Monkey
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 30, 2021 | 1:08 PM

అడవిలో బలమైన జంతువుల లిస్టులో చిరుత టాప్-3 లో ఉంటుంది. నక్కి, నక్కి వేటాడటం, వెంటాడి చంపడం రెండూ దానికి తెలుసు. ఎరను నోటబట్టడానికి అది ఎన్ని కథలైనా పడుతుంది. అయితే  అడవిలో అల్లరి చేస్తూ.. పెద్ద, పెద్ద జంతువులకు మస్కా కొట్టే కోతి కూడా ఉంటుందన్న విషయం మర్చిపోకూడదు. ఈ క్రమంలో మీ ముందుకు ఓ ఆసక్తికర వీడియోను తీసుకొచ్చాం. చెట్టు ఎక్కి చిటారుకొమ్మన కూర్చున్న కోతిని వేటాడేందుకు.. చిరుత కూడా చెట్టు ఎక్కింది. ఈ క్రమంలో కోతి తన చేష్టలతో చిరుత దూకుడు చెక్ పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది.

ముందుగా వీడియో వీక్షించండి…

వీడియోని గమనిస్తే… మొదటి  వేటాడే ఉద్దేశ్యంతో చిరుత కోతి ఉన్న చెట్టు ఎక్కుతుంది. అయితే కోతి మాత్రం చిటారు కొమ్మన.. ఉండి చిరుతను ముప్పు తిప్పులు పెట్టింది. చిరుత పడేపోతానేమో అన్న భయంతో ఎక్కువ ఎత్తు ఎక్కే సాహసం చేయలేదు. దీంతో ఆ కొమ్మపైకి, ఈ కొమ్మపైకి దూకుతూ కోతి రప్పాడించింది. దీంతో చిరుత ఆశలు అడియాశలైపోయాయి. ఢిలా పడిపోయి ఏం చెయ్యలేక గమ్మునుండిపోయింది. ఈ వీడియోను ‘లైఫ్ అండ్ నేచర్’ ట్విట్టర్ అకౌంట్ నుంచి షేర్ చేశారు. దీన్ని నెటిజన్లు బాగా లైక్ చేస్తున్నారు. ‘దమ్మే కాదు దిమాక్ కూడా అవసరం’ అని కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Also Read:  గుంటూరు జిల్లాలో మరణాల వెనుక మిస్టరీ ఏంటి..? చిక్కుముడిగా మారిన ప్రశ్నలు..

Viral Video: అది చెయ్యా.. సుత్తా..? పిడికిలిలో గుడ్డు పగలకుండా ఇది ఎలా సాధ్యం స్వామి