Six Members dead: గుంటూరు జిల్లాలో మరణాల వెనుక మిస్టరీ ఏంటి..? చిక్కుముడిగా మారిన ప్రశ్నలు..

ఉపాధి కోసం వేల కిలోమీటర్లు వలస వచ్చిన కూలీల జీవితాలు మంటల్లో కాలి బుడిదయ్యాయి. రేపల్లె మండలం లంకెవాని దిబ్బలో ఆరుగురు వలస కూలీలు...

Six Members dead: గుంటూరు జిల్లాలో మరణాల వెనుక మిస్టరీ ఏంటి..? చిక్కుముడిగా మారిన ప్రశ్నలు..
Fire Accident
Follow us

|

Updated on: Jul 30, 2021 | 12:07 PM

ఉపాధి కోసం వేల కిలోమీటర్లు వలస వచ్చిన కూలీల జీవితాలు మంటల్లో కాలి బుడిదయ్యాయి. రేపల్లె మండలం లంకెవాని దిబ్బలో ఆరుగురు వలస కూలీలు సజీవ దహనమయ్యారు. రొయ్యల చెరువు వద్ద ఒడిశాకు చెందిన వ్యక్తులు కాపలాకు కుదిరారు. గురువారం రాత్రి అంతా రొయ్యల చెరువు వద్ద ఉన్న రేకుల షెడ్డులో నిద్రపోయారు. గాఢ నిద్రలోకి జారుకున్నాక కరెంట్ తీగలు రేకుల షెడ్డు మీద పడి షార్ట్ సర్క్యూట్ అయ్యిందన్న వార్తలు గుప్పుమన్నాయి. ఈ ప్రమాదానికి అసలు కారణం ఏంటో ఇంత వరకూ బయటపడలేదు.  ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం అనేది పోలీసుల వెర్షన్‌.. షార్ట్ సర్క్యూట్ కాదన్నది విద్యుత్‌ సిబ్బంది వెర్షన్‌. మరి వాళ్ల మరణానికి అసలు కారణం ఏంటి? అన్నది చిక్కుముడిగా మారింది. పోలీసులు చెబుతున్నది నిజం అయితే…ఘటనా స్ధలానికి మీడియాను ఎందుకు అనుమతించడం లేదన్నది మరో ప్రశ్న. రేకుల షెడ్‌లో కెమికల్స్‌ ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. కెమికల్‌ బ్లాస్ట్‌ వల్లే ఈ ఆరుగులు ప్రాణాలు కోల్పోయారా.? అన్నది మిస్టరీగా మారింది. రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ,  బాపట్ల డిఎస్పీ శ్రీనివాస్ ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదం తీరుతెన్నులను పరిశీలిస్తున్నారు.

Question No.1: బ్లీచింగ్ పౌడర్ ఉన్న గదిలో కూలీలు ఎందుక నిద్రించారన్నది ఇక్కడ ప్రధాన ప్రశ్న. బ్లీచింగ్ రోడ్డు మీద కొడితేనే.. ముక్కుపుటాలు అదిరిపోయే వాసన ఇంట్లోకి వస్తుంది. అలాంటప్పుడు బ్లీచింగ్ ఉన్న రూమ్‌లో కూలీలు ఎలా నిద్రించారు..?

Question No.2:  మిగిలిన గదులు ఖాళీగా ఉన్నప్పటికీ.. ప్రమాదం జరిగిన గదిలోనే ఆరుగురు ఎందుకు నిద్రించారు..?

Question No.3: ప్రమాదం జరిగిన పక్క గదిలో మరో పది మంది కార్మికులు నిద్రిస్తున్నారు. మరి ఘటన జరిగిన సమయంలో వారు కనీసం మంటలు ఆర్పేందుకు ప్రయత్నించిన ఆనవాళ్లు కూడా ఎందుకు లేవు..?

Question No.4 :అక్కడ మొత్తం ఆరుగదులు ఖాళీ ఉంటే ..కెమికల్ డబ్బాలు ఉన్న గదిలో ఆరుగురు ఎందుకు పడుకున్నారు?

Question No.5: ఆరుగురు మగవాళ్ళు గదిలో పడుకుంటే ముగ్గురు ఆడవాళ్లు బయట ఎందుకు పడుకున్నారు?

Question No.6: అక్కడ గదుల్లో ఏ ఒక్క దానికి అసలు తలుపు లేవు.. ఒకవేళ మంటలు చెలరేగితే బయటకు తప్పించుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి..కానీ వీళ్ళు ఎందుకు కదల్లేకపోయారు.

Question No.7:  అసలు అది షార్ట్ సర్కుట్ వల్ల జరిగిన ప్రమాదమా లేక ఎవరైనా నిప్పు అంటించి పారిపోయారా?

Question No.8: ఘటనాస్థలికి మీడియా వెళ్లేందుకు ఎంత ప్రయత్నించినా.. పోలీసులు ఎందుకు అనుమతించడం లేదు..?

Also Read:Viral Video: అది చెయ్యా.. సుత్తా..? పిడికిలిలో గుడ్డు పగలకుండా ఇది ఎలా సాధ్యం స్వామి

వామ్మో..! ఈ మొక్క పురుగులను తినేస్తుంది.. వీడియో చూస్తే షాకవుతారు