AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brewery: సారాయి పారబోతకు చెరువు తవ్వకం.. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన యదార్థం.!

సారా పారబోతకు చెరువు తవ్వకం. ఎస్, మీరు విన్నది నిజమే. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన యదార్థమిది. అక్రమ సారా వ్యాపారం ఎలా సాగుతుందో చెప్పేందుకు ఇక్కడి దృశ్యాలే నిదర్శనం...

Brewery: సారాయి పారబోతకు చెరువు తవ్వకం.. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన యదార్థం.!
Liquor
Venkata Narayana
|

Updated on: Jul 30, 2021 | 7:33 PM

Share

Breweries: సారా పారబోతకు చెరువు తవ్వకం. ఎస్, మీరు విన్నది నిజమే. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన యదార్థమిది. అక్రమ సారా వ్యాపారం ఎలా సాగుతుందో చెప్పేందుకు ఇక్కడి దృశ్యాలే నిదర్శనం. తాము స్వాధీనం చేసుకున్న సారాను పారబోసేందుకు తూర్పు గోదావరి జిల్లా ఎక్సైజ్ అధికారులు ఏకంగా చెరువును తవ్వాల్సి వచ్చిందంటే మేటర్ ఎంతుందో అవగతమవుతోంది.

Liquor 2

కట్ చేస్తే, కాకినాడ రూరల్‌లో SEB పోలీసులు 20 వేల 500 లీటర్ల నాటుసారాను పట్టుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా SP రవీంద్రనాథ్ బాబు ఆధ్వర్యంలో స్పెషల్ రైడ్స్‌ చేశారు. పెద్ద ఎత్తున ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ అరకోటి ఉండొచ్చు. ఆ ప్యాకెట్లను పగలగొట్టి.. సారాను పారబోసేందుకు ఏకంగా చెరువును తవ్వాల్సి వచ్చింది.

Liquor 3

తూర్పు గోదావరి జిల్లా SP, కాన్ఫిస్కేషన్ అథారిటి వారి ఆదేశాల ప్రకారం జిల్లా పరిధిలో SEB స్టేషన్‌లు, పోలీస్ స్టేషన్‌ల నందు వివిధ కేసులలో స్వాధీనపరుచుకున్న నాటు సారాయిని తూర్పు గోదావరి జిల్లా SP, జాయింట్ డైరెక్టర్ SEB, A. రమాదేవి తదితరులు కాకినాడ రూరల్ మండల నేమం గ్రామం దగ్గరగల ఖాళీ స్థలము లో 20479.55 లీటర్ల నాటుసారాయిని ఇవాళ ధ్వంసం చేశారు.

Liquor 4

ఈ సందర్భంగా SP మాట్లాడుతూ.. నాటు సారా తయారీ, అమ్మకాలు, అక్రమ మద్యం, మాదక ద్రవ్యాలు తయారీ, రవాణాకు సంబంధించి ఏవిధమైన సమాచారం తెలిసినా, SEB (స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో) వారి కంట్రోల్ రూమ్ నంబరు 9490618510 కు సమాచారం అందజేయగలరని, సమాచారం ఇచ్చిన వారి వివరములు గోప్యంగా ఉంచబడతాయని SP తెలియజేశారు.