Sonu Sood: సోను సూద్ బర్త్ డే వేళ ఫాన్స్ కు ఆచార్య టీం సర్ప్రైజ్ గిఫ్ట్…

సోనూసూద్.. ఇప్పుడు ఎవరి నోట విన్న ఇదే పేరు. కరోనా కష్టాల్లో వలస కార్మికులకు అపద్భాంధవుడిగా నిలిచాడు.

Sonu Sood: సోను సూద్ బర్త్ డే వేళ ఫాన్స్ కు ఆచార్య టీం సర్ప్రైజ్ గిఫ్ట్...
Sonu Sood
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 30, 2021 | 9:08 PM

సోనూసూద్.. ఇప్పుడు ఎవరి నోట విన్న ఇదే పేరు. కరోనా కష్టాల్లో వలస కార్మికులకు అపద్భాంధవుడిగా నిలిచాడు. దీంతో దేశ వ్యాప్తంగానే కాకుండా.. విదేశాల్లో సైతం సోనూసూద్ కోసం అభిమానలయ్యారు. కరోనా కష్ట కాలంలో అన్ని వర్గాల ప్రజలకు చేతనైనంత సాయం చేసి ఎంతోమందికి ప్రత్యక్ష దైవంగా మారాడు. నేడు (జూలై 30) రియల్ హీరో సోనూసూద్ కు పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ ప్రముఖులు సహా సామాన్యులు ఆయనకు బర్త్‌డే విషెస్‌ తెలియజేస్తున్నారు. తాజాగా సోనూసూద్ పుట్టిన రోజు సందర్భంగా ఆచార్య టీం ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది.

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య సినిమాలో సోనూసూద్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన పుట్టిన రోజు సందర్భంగా చిత్రయూనిట్ ఆచార్య నుంచి సోనూసూద్ ఫస్ట్‏లుక్ పోస్టర్‏ను విడుదల చేసింది. అందులో నుదుట బొట్టు పెట్టుకుని పిల‌క‌తో సోనూసూద్ సరికొత్త లుక్ లో కనిపించారు. అయితే ఇప్పటి వరకు తెలుగులో విలన్ పాత్రలతో పాపులర్ అయిన సోనూసూద్ ఆచార్యలో మాత్రమ్ సరికొత్త పాత్రలో కనిపించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే.. ఆచార్యలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రలలో నటిస్తున్నారు.

ట్వీట్..

Also Read:

Sarkaru Vaari Paata: క్రేజీ అప్‏డేట్.. ఫేమస్ మ్యూజిక్ సంస్థకు ‘సర్కారు వారి పాట’ ఆడియో రైట్స్..

టాలీవుడ్‏లో పాగా వేసేందుకు సిద్ధమైన హీరోయిన్ ఈ ఫోటోలో ఉంది.. ఎవరో గుర్తుపట్టగలరా ?

Narappa Success Meet: విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్న’నారప్ప’ టీం.. సక్సెస్ మీట్ లైవ్..