Anasuya: వెండితెరపై అనుసూయ హవా.. మరో సినిమాలో వినూత్నమైన పాత్రలో…

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Jul 30, 2021 | 10:13 PM

బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ అనుసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అటు యాంకర్ ‏గా ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ

Anasuya: వెండితెరపై అనుసూయ హవా.. మరో సినిమాలో వినూత్నమైన పాత్రలో...
Anasuya

బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ అనుసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అటు యాంకర్ ‏గా ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ సమయం ఉన్నప్పుడల్లా.. వెండితెరపై కూడా మెరుస్తోంది. సినిమాల్లో కీలక పాత్రలలో మాత్రమే కాకుండా.. అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ లోనూ అలరిస్తోంది అనసూయ. రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన రంగస్థలం సినిమాలోని రంగమ్మాత్త పాత్రతో తన సత్తా ఏంటో నిరూపించుకుంది. రంగమ్మత్త పాత్రలో అనసూయ నటకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత క్షణం, కథనం వంటి సినిమాల నుంచి ఇటీవల వచ్చిన థ్యాంక్యూ బ్రదర్ సినిమాలలోనూ ప్రేక్షకులను పలకరించింది.

ప్రస్తుతం పుష్ప సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఈ సినిమాలో అనసూయ పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. తాజాగా మరో సినిమాకు అనసూయ ఓకె చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో ఆమె ‘ఎయిర్ హోస్టెస్’గా కనిపించనుందని అంటున్నారు.

గతంలో ‘పేపర్ బాయ్’ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించిన జయశంకర్, కొత్తగా ఒక కథను తయారు చేసున్నాడు. ఈ కథలో 6 ప్రధానమైన పాత్రలు ఉంటాయి. ఆ పాత్రల నేపథ్యం .. వాటి నడక .. కలయిక చాలా ఆసక్తికరంగా ఉంటుందని అంటున్నారు. అందులో ఎయిర్ హోస్టెస్ గా అనసూయ కనిపిస్తుందని టాక్.

Also Read:

Sonu Sood: సోను సూద్ బర్త్ డే వేళ ఫాన్స్ కు ఆచార్య టీం సర్ప్రైజ్ గిఫ్ట్…

తెరపైకి మరో బయోపిక్.. ప్రజల మనసులను గెలిచిన ఎమ్మెల్యే జీవిత కథగా..

Sarkaru Vaari Paata: క్రేజీ అప్‏డేట్.. ఫేమస్ మ్యూజిక్ సంస్థకు ‘సర్కారు వారి పాట’ ఆడియో రైట్స్..

టాలీవుడ్‏లో పాగా వేసేందుకు సిద్ధమైన హీరోయిన్ ఈ ఫోటోలో ఉంది.. ఎవరో గుర్తుపట్టగలరా ?

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu