యూకేలోని డెర్బీషైర్ ప్రాంతంలో 42 ఏళ్ల టామీ లించ్ రాత్రి పడుకుని ఉదయం లేచేసరికి శరీరం నీలం రంగులోకి మారిపోయింది. అవతార్ సినిమాలో పాత్రలా కనిపించిన టామీ ఆసుపత్రికి వెళ్లాడు. డాక్టర్లు ఆరా తీయగా, నీలం రంగు పరుపు, దుప్పట్ల కారణంగా రంగు అంటుకుందని తెలిసి నవ్వుకున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.