AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన నాగుపాము.. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి..

శివనామ స్మరణతో మార్మోగాల్సిన రాజన్న ప్రాంగణం ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. క్యూలైన్లలో భక్తులు భయంతో పరుగులు తీస్తుండగా, సాక్షాత్తూ ఆ పరమశివుడి ఆభరణంలా భావించే నాగుపాము పడగ విప్పి సంచరించడం అందరినీ షాక్‌కు గురిచేసింది. సుమారు 20 నిమిషాల పాటు ఆలయంలో హైడ్రామా నడిచింది.

Telangana: వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన నాగుపాము.. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి..
Snake In Vemulawada Rajanna Temple
G Sampath Kumar
| Edited By: |

Updated on: Mar 21, 2026 | 11:30 AM

Share

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఒక్కసారిగా భయంకర సీన్ కనిపించింది. నిత్యం శివనామ స్మరణతో మారుమోగే ఆలయ ముంగిట, సాక్షాత్తు ఆ పరమశివుడి మెడలోని ఆభరణంలా భావించే నాగుపాము ప్రత్యక్షమవ్వడంతో భక్తులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఆలయ ప్రాంగణంలో సుమారు 7 అడుగుల భారీ నాగుపాము ప్రత్యక్షమై, సుమారు 20 నిమిషాల పాటు స్వేచ్ఛగా సంచరించింది. దీంతో దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పరిస్థితిని గమనించిన పోలీస్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై, పాము ఎవరికీ హాని చేయకుండా, భక్తులు దాని దరికి వెళ్లకుండా రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు. వెంటనే స్పందించిన ఆలయ అధికారులు స్నేక్ క్యాచర్ జగదీష్‌ను పిలిపించారు. ఆయన చాకచక్యంగా ఆ భారీ నాగుపామును పట్టుకుని, జనావాసాలు లేని సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

వరుస ఘటనలు.. భక్తుల్లో పెరుగుతున్న ఆందోళన

అయితే ఈ ఘటన కేవలం యాదృచ్ఛికం కాదని స్థానికులు, భక్తులు అభిప్రాయపడుతున్నారు. గతంలో కూడా రెండు మూడు సార్లు ఆలయ పరిసరాల్లో పాములు కనిపించడం కలకలం రేపింది. ఇటీవల ఆలయ పరిసరాల్లో జరుగుతున్న భారీ అభివృద్ధి పనుల కారణంగా భూమి లోపల లేదా శిథిలాల చాటున ఉన్న పాముల ఆవాసాలకు ఆటంకం కలిగి ఉండవచ్చని, అందుకే అవి బయటకు వస్తున్నాయని తెలుస్తోంది. ఆలయ పరిసరాల్లో పారిశుధ్య లోపం లేదా పొదలు పెరగడం వల్ల కూడా పాముల సంచారం పెరిగే అవకాశం ఉందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అధికారులకు భక్తుల డిమాండ్

వేల సంఖ్యలో భక్తులు వచ్చే పుణ్యక్షేత్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం భద్రతా పరమైన వైఫల్యంగా కనిపిస్తోంది. భక్తుల భద్రత దృష్ట్యా ఆలయ అధికారులు ఈ చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతోంది. ఆలయ పరిసరాల్లో నిరంతరం నిఘా ఉంచేలా ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలి. అభివృద్ధి పనులు జరుగుతున్న చోట వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించి, పొదలు లేకుండా జాగ్రత్త పడాలి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే చోట సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ పెంచి, ఇలాంటి జంతువుల కదలికలను ముందే గుర్తించాలి.

Follow Us
వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన నాగుపాము.. ఆ తర్వాత ఏంజరిగిందో
వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన నాగుపాము.. ఆ తర్వాత ఏంజరిగిందో
రోజూ టన్నుల కొద్దీ జీడిపప్పు ఎలా ప్రాసెస్ చేస్తారో తెలిస్తే
రోజూ టన్నుల కొద్దీ జీడిపప్పు ఎలా ప్రాసెస్ చేస్తారో తెలిస్తే
ఐపీఎల్ 2025లో బ్యాటర్ల చేతిలో బలైపోయిన టాప్-5 బౌలర్లు వీళ్లే
ఐపీఎల్ 2025లో బ్యాటర్ల చేతిలో బలైపోయిన టాప్-5 బౌలర్లు వీళ్లే
ఎండు చేపలు వండే ముందు ఈ చిట్కా పాటిస్తే.. అస్సలు వాసన రాదు..
ఎండు చేపలు వండే ముందు ఈ చిట్కా పాటిస్తే.. అస్సలు వాసన రాదు..
తనపై వస్తున్న విమర్శలపై టీవీ9తో హైడ్రా కమిషర్ రంగనాథ్ ఏమన్నారంటే?
తనపై వస్తున్న విమర్శలపై టీవీ9తో హైడ్రా కమిషర్ రంగనాథ్ ఏమన్నారంటే?
ప్రియుడిని పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ..
ప్రియుడిని పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ..
పాత దువ్వెనలను పారేస్తున్నారా? ఇలాంటి ఐడియాలతో మళ్లీ వాడేయండి!
పాత దువ్వెనలను పారేస్తున్నారా? ఇలాంటి ఐడియాలతో మళ్లీ వాడేయండి!
చెరుకు రసం Vs పుచ్చకాయ రసం.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?
చెరుకు రసం Vs పుచ్చకాయ రసం.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?
బంగారం ధరల్లో భారీ క్రాష్.. త్వరలో రూ.1.20 లక్షలకు డౌన్..!
బంగారం ధరల్లో భారీ క్రాష్.. త్వరలో రూ.1.20 లక్షలకు డౌన్..!
జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే రుచి అదుర్స్
జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే రుచి అదుర్స్