AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Talangana: సర్పంచులకు సూపర్ గుడ్‌ న్యూస్.. గ్రామ పంచాయతీల అభివృద్ధి రూ.9,968 కోట్ల నిధులు

తెలంగాణలోని స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్‌కు అభివృద్ధికిగాను 16వ ఆర్థిక సంఘం కింద ఐదేళ్ల కాలానికి సంబంధించి నిధులను కేంద్ర సర్కార్ కేటాయింది. ఈ మేరకు రూ. 9,968 కోట్ల గ్రాంట్లను కేటాయింస్తున్నట్టు కేంద్ర ప్రకటించింది. ఈ నిధులను స్థానిక సంస్థల అభివృద్ధికి మాత్రమే వాడాలని కేంద్ర స్పష్టం చేసింది.

Talangana: సర్పంచులకు సూపర్ గుడ్‌ న్యూస్.. గ్రామ పంచాయతీల అభివృద్ధి రూ.9,968 కోట్ల నిధులు
16th Finance Commission Funds
Anand T
|

Updated on: May 25, 2026 | 10:07 AM

Share

తెలంగాణలోని స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల బలోపేతానికి కేంద్ర 16వ ఆర్థిక సంఘం భారీగా మొత్తంలో నిధులను కేటాయించింది. ఈ మేరకు 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 వరకు అంటే సుమారు ఐదేళ్ల కాలానికి గాను తెలంగాణకు రూ.9,968 కోట్లను కేటాయిస్తున్నట్టు పేర్కొంది. అయితే ఈ నిధుల వినియోగం, పర్యవేక్షణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని స్పష్టమైన మార్గదర్శకాలను కూడా జారీ చేసింది.

కేంద్రం నుంచి వచ్చే ఈ నిధులను కేవలం మండల, జిల్లా ప్రజా పరిషత్‌, గ్రామ పంచాయతీల అభివృద్ధికి మాత్రమే వాడాలని తెలిపింది. గ్రామాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, రోడ్లు, స్ట్రీట్‌ లైట్‌ల ఏర్పాటు వంటి ప్రజలకు ఉపయోగపడే వాటికి మాత్రమే ఈ నిధులను వాడాలని స్పష్టం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిధులను ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు ఇచ్చేందుకు వినిగించకూడదని తెలిపింది.

అయితే ఈ నిధుల దుర్వినియోగం చేయకుండా ప్రభుత్వం కఠినమైన నిబంధనలను తీసుకొచ్చింది. ప్రతి స్థానిక సంస్థ ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులకు తాము ఖర్చు చేసే వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని తెలిపింది. ఏడాదిలో నిధులు దేనికి ఖర్చు చేవారో, చేసిన అభివృద్ధి ఏమిటి అనే నివేదికలను రాష్ట్ర ప్రభుత్వాని అందజేయాలని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం వాటి సమగ్ర నివేదికను కేంద్రానికి సమర్పించాలని ఆదేశించింది. ఆడిట్‌లో లోపాలు, నిధులు దుర్వినియోగం జరిగినట్టు తేలితే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని.. ఈ మేరకు స్థానక సంస్థలకు ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

అయితే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలకు ఐదేళ్ల కాలానికి సంబంధించి ఆర్థిక సంఘం రూ.4,35,236 కోట్లను గ్రాంట్లుగా ప్రకటించింది. వీటిలో 80 శాతం నిధులు గ్రామ పంచాయతీలకు కేటాయించగా, 10 శాతం మండల పరిషత్‌లకు, మరో 10 శాతం జిల్లా పరిషత్‌లకు అందజేయనున్నటు తెలిపింది. ప్రతి సంవత్సరం జూన్, అక్టోబర్ నెలల్లో రెండు విడతల్లోఈ నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తోంది.

అయితే ఆయా రాష్ట్రాల స్థానిక సంస్థల పనితీరు ఆధారంగా మొత్తం నిధుల్లో 20 శాతం నిధుల విడుదలను కేంద్ర నిర్ణయిస్తుంది. 2026 నాటి అంచనాల ప్రకారం గ్రామీణ జనాభాకు 90 శాతం, రాష్ట్ర వైశాల్యానికి 10 శాతం నిధులు కేటాయించారు. అంటే తెలంగాణ గ్రామీణ జనాభాకు 1.92 శాతం, వైశాల్యానికి 0.37 శాతం చొప్పున మొత్తం రూ.9,968 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా