AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ పెంపుడు జంతువు మాట్లాడితే? ఇదిగో ఆ టెక్నాలజీ.. సరికొత్త పెట్ ట్రాన్స్‌లేటర్ మీ కోసమే!

మీ పెంపుడు జంతువులు ఏం మాట్లాడుతున్నాయో తెలుసుకోవాలని ఉందా..? అవును.. ఇప్పుడు మనుషులతో జంతువులు, పక్షులు కూడా మాట్లాడగలవు. ఎంటీ ఆశ్చర్యపోతున్నారా!.. మీరు చదివింది నిజమే. మీ పిల్లి లేదా కుక్కకు వినోదాన్ని అందించే అనేక స్మార్ట్, AI పరికరాలను మీరు చూసి ఉండవచ్చు. కానీ, సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందింది అంటే.. మీ పెంపుడు జంతువు ఏం అనుభూతి చెందుతోంది.. ఏం చెబుతోందో మీరు అర్థం చేసుకోగలరు..? అదేలాగో పూర్తి వివరాల్లోకి వెళితే...

మీ పెంపుడు జంతువు మాట్లాడితే? ఇదిగో ఆ టెక్నాలజీ.. సరికొత్త పెట్ ట్రాన్స్‌లేటర్ మీ కోసమే!
Pet Communication TechnologyImage Credit source: freepik
Jyothi Gadda
|

Updated on: May 25, 2026 | 3:12 PM

Share

చాలా సినిమాల్లో జంతువులు మనుషులతో మాట్లాడుతుంటాయి. ఇప్పుడు అది నిజ జీవితంలో కూడా జరగబోతోంది. జంతువులు మనతో మాట్లాడే రోజులు వచ్చేశాయి..ఈ ఊహ ఎంత బాగుందో కదా! ఇక ఇదే నిజం కానుంది. ఒక చైనీస్ స్టార్టప్ కంపెనీ అటువంటి AI పెంపుడు జంతువుల అనువాదకుడిని సృష్టించినట్లు పేర్కొంది. ఇది జంతువుల శబ్దాలు, భావోద్వేగాలు, వాటి ప్రవర్తనను దాదాపు 95శాతం కచ్చితత్వంతో గుర్తించగలదు. ఈ పరికరం పెంపుడు జంతువులు, వాటి యజమానుల మధ్య సంభాషణను గతంలో కంటే సులభతరం, మరింత ప్రత్యేకంగా చేయగలదని ఆ కంపెనీ చెబుతోంది.

కంపెనీ ప్రకారం, కంపెనీ తయారు చేసిన ఒక ప్రత్యేక పరికరం పెంపుడు జంతువు మెడలో వేస్తే దాని స్వరం, భావోద్వేగాలు, ప్రవర్తనను సుమారు 95శాతం కచ్చితత్వంతో గుర్తించగలదు. ఈ ఏఐ-ఆధారిత పరికరం కోసం ప్రీ-ఆర్డర్లు ఈ నెల ప్రారంభంలో మొదలయ్యాయి. ఇప్పటికే 10,000 మందికి పైగా దీనిని బుక్ చేసుకున్నారు. దీనిని ఉపయోగించి తమ జంతువులతో సంభాషించగలగడం పట్ల పెంపుడు జంతువుల యజమానులు ఉత్సాహంగా ఉన్నారు.

మన ఇంట్లో పెంచుకునే కుక్కలు లేదా పిల్లులు ఏం ఆలోచిస్తున్నాయో, వాటికి ఏం కావాలో అర్థం చేసుకోవడం చాలా మంది యజమానులకు ఒక పెద్ద సవాలు. ఒకవేళ అవి చేసే శబ్దాలను, వాటి భావాలను మనం సులభంగా అర్థం చేసుకోగలిగితే ఎంత బాగుంటుందో కదా! సరిగ్గా ఇలాంటి ఆలోచనతోనే చైనాకు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత పెట్ ట్రాన్స్‌లేటర్ (Pet Translator) పరికరాన్ని మార్కెట్లోకి తీసుకువచ్చింది.

ఇవి కూడా చదవండి

ఈ వినూత్న గ్యాడ్జెట్‌ను పెంపుడు జంతువుల మెడకు బెల్ట్ లాగా అమర్చవచ్చు. ఇది జంతువుల అరుపులు (కుక్కల మొరగడం, పిల్లుల మ్యావ్ శబ్దాలు), వాటి శారీరక ప్రవర్తన, భావోద్వేగాలను ట్రాక్ చేస్తుంది. ఈ డేటాను విశ్లేషించి, అవి ఏం చెప్పాలనుకుంటున్నాయో దాదాపు 95 శాతం ఖచ్చితత్వంతో మనుషుల భాషలోకి అనువదిస్తుందని సదరు చైనీస్ కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. యజమానులకు, వారి మూగజీవాలకు మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ సాంకేతికత ఉపయోగపడుతుందని కంపెనీ భావిస్తోంది.

ఈ AI పెట్ ట్రాన్స్‌లేటర్ ధరను 799 చైనీస్ యువాన్లు (సుమారు 118 డాలర్లు లేదా భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 9,000) గా నిర్ణయించారు. ఈ పరికరం పట్ల పెంపుడు జంతువుల ప్రేమికుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ నెల ప్రారంభంలోనే దీని ప్రీ-ఆర్డర్లు మొదలుకాగా, ఇప్పటికే 10,000 మందికి పైగా యజమానులు దీనిని కొనుగోలు చేయడానికి బుక్ చేసుకున్నారు.

ఈ సరికొత్త పరికరం ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కొందరు దీనిని సాంకేతిక విప్లవంగా కొనియాడుతుంటే, మరికొందరు మాత్రం కంపెనీ వాదనలపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. జంతువుల భాషను అనువదించే ప్రక్రియకు సంబంధించి కంపెనీ ఎటువంటి గట్టి శాస్త్రీయ ఆధారాలను లేదా డేటాను ప్రదర్శించలేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. కేవలం కొన్ని ప్రమోషనల్ వీడియోలలో పిల్లుల మ్యావ్ శబ్దాలను కలర్‌ఫుల్ బబుల్స్ రూపంలో మనుషుల మాటల్లోకి మార్చి చూపించారని, కానీ నిజ జీవితంలో ఇది ఎంతవరకు ఖచ్చితంగా పనిచేస్తుందనేది వేచి చూడాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో ఈ పరికరం జంతువుల సంరక్షణలో ఎలాంటి మార్పులు తెస్తుందో చూడాలి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఒకే ఒక్క క్షణం.. మాటలకందని విషాదం.. మిత్రుల కళ్ల ముందే ఘోరం
ఒకే ఒక్క క్షణం.. మాటలకందని విషాదం.. మిత్రుల కళ్ల ముందే ఘోరం
సడెన్‌గా పులి ఎదురైతే ఏం చేయాలి..? ఇలా చేస్తే ఈజీగా
సడెన్‌గా పులి ఎదురైతే ఏం చేయాలి..? ఇలా చేస్తే ఈజీగా
సండే స్పెషల్.. నెల్లూరు స్టైల్ చికెన్ ఫ్రై.. ఎలా చేయాలంటే?
సండే స్పెషల్.. నెల్లూరు స్టైల్ చికెన్ ఫ్రై.. ఎలా చేయాలంటే?
లార్డ్స్‌లో చెలరేగిన టీమిండియా సెన్సేషన్.. తొలి భారత ప్లేయర్‌గా..
లార్డ్స్‌లో చెలరేగిన టీమిండియా సెన్సేషన్.. తొలి భారత ప్లేయర్‌గా..
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి చనిపోతే ఆ బిల్లు ఎవరు కడతారు?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి చనిపోతే ఆ బిల్లు ఎవరు కడతారు?
తెలుగులో ఆ స్టార్ హీరో నాకు ఆరాధ్య దైవం..
తెలుగులో ఆ స్టార్ హీరో నాకు ఆరాధ్య దైవం..
బావిలో తొంగి చూస్తే భారీ గిరినాగు.. ఏం చేసారో తెలుసా..?
బావిలో తొంగి చూస్తే భారీ గిరినాగు.. ఏం చేసారో తెలుసా..?
స్విట్జర్లాండ్ ట్రిప్‌కెళ్లిన హైదరాబాద్ దంపతుల మిస్టరీ మిస్సింగ్
స్విట్జర్లాండ్ ట్రిప్‌కెళ్లిన హైదరాబాద్ దంపతుల మిస్టరీ మిస్సింగ్
6 సంవత్సరాల తర్వాత మళ్లీ.. 30 రోజుల పాటు నెట్‌ఫ్లిక్స్‌ ఉచితం..!
6 సంవత్సరాల తర్వాత మళ్లీ.. 30 రోజుల పాటు నెట్‌ఫ్లిక్స్‌ ఉచితం..!
ప్రపంచ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన ఇంగ్లాండ్ డేంజరస్ జోడీ
ప్రపంచ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన ఇంగ్లాండ్ డేంజరస్ జోడీ