AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bakrid Special Recipe: నోట్లో వేస్తే కరిగిపోయే లక్నోయి మటన్ గలౌటీ కబాబ్.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!

బక్రీద్ పండుగ అనగానే నోరూరించే ఎన్నో రకాల మాంసాహార వంటకాలు గుర్తొస్తాయి. వాటిలో అత్యంత ప్రత్యేకమైనది, మొఘలాయ్ శైలికి చెందిన లక్నోయి మటన్ గలౌటీ కబాబ్‌. గలౌటీ అంటే నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోయేది అని అర్థం. పూర్వం లక్నో నవాబుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన ఈ వంటకాన్ని ఇంట్లోనే సులభంగా సిద్ధం చేసుకోవచ్చు. బాగా మెత్తగా చేసిన మటన్ కీమాకు పచ్చి బొప్పాయి పేస్ట్, అల్లం-వెల్లుల్లి, వేయించిన శనగపిండి, ప్రత్యేకమైన గలౌటీ మసాలా దట్టించి నెయ్యి లేదా నూనెతో తక్కువ మంటపై కాల్చుకోవాలి. పండుగ రోజున అతిథులకు వడ్డించడానికి ఇది ఒక అద్భుతమైన రాయల్ డిష్.

Bakrid Special Recipe: నోట్లో వేస్తే కరిగిపోయే లక్నోయి మటన్ గలౌటీ కబాబ్.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
Lucknowi Galouti Kebab Recipe
Jyothi Gadda
|

Updated on: May 24, 2026 | 8:50 PM

Share

బక్రీద్ పండుగ వస్తోందంటే ముస్లింల ఇళ్లలో రకరకాల మటన్ వంటకాల సువాసనలు గుబాళిస్తాయి. బిర్యానీలు, కోర్మాలతో పాటు పండుగ విందులో కబాబ్‌లు ఖచ్చితంగా ఉండాల్సిందే. మీరు ఈసారి పండుగకు కాస్త భిన్నంగా, రాయల్ టేస్ట్‌ను ఆస్వాదించాలనుకుంటే లక్నోయి మటన్ గలౌటీ కబాబ్ (Lucknowi Mutton Galouti Kebab) సరైన ఎంపిక. లక్నో నవాబుల కాలం నాటి ఈ ప్రసిద్ధ వంటకం నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతుంది. దీని తయారీ విధానం ఇక్కడ చూద్దాం.

కావలసిన పదార్థాలు:

మెత్తటి మటన్ కీమా (అర కిలో), పచ్చి బొప్పాయి పేస్ట్ (2 చెంచాలు – ఇది మాంసాన్ని మెత్తగా చేయడానికి వాడతారు), అల్లం-వెల్లుల్లి పేస్ట్, వేయించిన శనగపిండి (3 చెంచాలు), గరం మసాలా, కుంకుమపువ్వు నీరు, గులాబీ నీరు (కొద్దిగా), రుచికి సరిపడా ఉప్పు, కారం, కాల్చడానికి నెయ్యి లేదా నూనె.

తయారీ విధానం: ముందుగా, మటన్ కీమాను ఎలాంటి పలుకులు లేకుండా మిక్సీలో వేసి చాలా మెత్తటి పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. గలౌటీ కబాబ్ సాఫ్ట్‌గా రావడానికి కీమా ఎంత మెత్తగా ఉంటే అంత మంచిది. ఈ మెత్తటి కీమాకు పచ్చి బొప్పాయి పేస్ట్, అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా, కుంకుమపువ్వు నీరు, గులాబీ నీరు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కనీసం 2 గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. బొప్పాయి పేస్ట్ వల్ల మాంసం చాలా సాఫ్ట్‌గా మారుతుంది.

ఇవి కూడా చదవండి

దాదాపు ఒక ఐదు నిమిషాల తరువాత ఫ్రిజ్ నుండి తీసిన మిశ్రమానికి వేయించిన శనగపిండిని (Besan) జత చేసి బాగా కలుపుకోవాలి. ఇది కబాబ్‌లు విరిగిపోకుండా బైండింగ్‌లా పనిచేస్తుంది. ఇప్పుడు చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని, చిన్న చిన్న గుండ్రటి కబాబ్ పట్టీల్లా ఒత్తుకోవాలి. తవాపై నెయ్యి లేదా నూనె వేసి, తక్కువ మంటపై రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దోరగా కాల్చుకోవాలి.

కబాబ్ మిశ్రమానికి మొఘలాయ్ రుచి రావాలంటే, కాల్చిన బొగ్గు ముక్కను ఒక చిన్న గిన్నెలో ఉంచి, కబాబ్ మిశ్రమం మధ్యలో పెట్టి, దానిపై కొద్దిగా నెయ్యి వేసి 5 నిమిషాల పాటు మూత పెట్టాలి (దుంగార్ పద్ధతి). దీనివల్ల కబాబ్‌లకు మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ఈ విధంగా తయారైన వేడివేడి లక్నోయి గలౌటీ కబాబ్‌లను పుదీనా చట్నీ, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసంతో వడ్డిస్తే పండుగ పూట మీ ఇంట్లో నవాబీ విందు సిద్ధమైనట్లే!

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
పెరిగిన రకూన్‌ల సంఖ్య.. పంట నష్టంతో రైతులు విలవిల !
పెరిగిన రకూన్‌ల సంఖ్య.. పంట నష్టంతో రైతులు విలవిల !
కేవలం రూ.40 చెల్లిస్తే వాట్సప్‌లోనే క్యాస్ట్ సర్టిఫికేట్
కేవలం రూ.40 చెల్లిస్తే వాట్సప్‌లోనే క్యాస్ట్ సర్టిఫికేట్
ఏపీకి తుఫాన్ ముప్పు.. రాబోయే 5 రోజులు భారీ వర్షాలు..
ఏపీకి తుఫాన్ ముప్పు.. రాబోయే 5 రోజులు భారీ వర్షాలు..
'జైలర్ 2' రికార్డు కలెక్షన్లు.. ఎట్టకేలకు నెరవేరనున్న కోలీవుడ్ కల
'జైలర్ 2' రికార్డు కలెక్షన్లు.. ఎట్టకేలకు నెరవేరనున్న కోలీవుడ్ కల
క్రెడిట్ కార్డు ఉపయోగించడం లేదా..? మీకే నష్టం.. ఎలా అంటే..?
క్రెడిట్ కార్డు ఉపయోగించడం లేదా..? మీకే నష్టం.. ఎలా అంటే..?
కూర్చునే విధానాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
కూర్చునే విధానాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
వెంకీ, త్రివిక్రమ్ ల 'ఆదర్శ కుటుంబం 'ట్రైలర్ వచ్చేసింది
వెంకీ, త్రివిక్రమ్ ల 'ఆదర్శ కుటుంబం 'ట్రైలర్ వచ్చేసింది
రైతన్నకు ఎంత కష్టమొచ్చే.. కరువు పంజాతో చేతికొచ్చిన పంట కళ్లముందే
రైతన్నకు ఎంత కష్టమొచ్చే.. కరువు పంజాతో చేతికొచ్చిన పంట కళ్లముందే
ఇంట్లో ఇడ్లీలు మిగిలిపోతున్నాయా? ఈ మసాలా స్నాక్ చేస్తే అదుర్స్
ఇంట్లో ఇడ్లీలు మిగిలిపోతున్నాయా? ఈ మసాలా స్నాక్ చేస్తే అదుర్స్
ఇషాన్ కిషన్ స్థానంలో కొత్త ప్లేయర్.. ఎవరంటే?
ఇషాన్ కిషన్ స్థానంలో కొత్త ప్లేయర్.. ఎవరంటే?