AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షాంపూలకు గుడ్ బై.. ఈ మట్టితో తలస్నానం చేయండి.. పట్టులాంటి మెరిసే జుట్టు మీ సొంతం!

ప్రస్తుత రోజుల్లో కాలుష్యం, ఒత్తిడి, కెమికల్స్ ఎక్కువగా ఉండే హెయిర్ ప్రొడక్ట్స్ వల్ల చాలా మంది జుట్టు రాలడం, పొడిబారడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. మార్కెట్లో దొరికే రకరకాల షాంపూలు తాత్కాలికంగా జుట్టును శుభ్రం చేసినప్పటికీ, లాంగ్ రన్‌లో జుట్టులోని సహజసిద్ధమైన తేమను లాగేసుకుంటాయి. అందుకే, మన పూర్వీకుల కాలం నాటి ముల్తానీ మట్టి (Fuller's Earth) ని ఉపయోగించి తలస్నానం చేయడం ద్వారా జుట్టును ఎంతో ఆరోగ్యంగా, మృదువుగా మార్చుకోవచ్చు. అదేలాగో ఇక్కడ చూద్దాం..

Jyothi Gadda
|

Updated on: May 24, 2026 | 5:27 PM

Share
కెమికల్స్ ఎక్కువగా ఉండే షాంపూల వల్ల జుట్టు నిర్జీవంగా, పొడిగా మారుతుంటుంది. దీనికి ప్రత్యామ్నాయంగా ముల్తానీ మట్టి (Multani Mitti) తో జుట్టును శుభ్రం చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయని బ్యూటీ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. ముల్తానీ మట్టి జుట్టును మృదువుగా (Smooth) చేయడమే కాకుండా, తలలోని అదనపు నూనెను, మురికిని సమర్థవంతంగా తొలగిస్తుందని అంటున్నారు. జుట్టు సంరక్షణ కోసం ముల్తానీ మట్టిని ఎలా ఉపయోగించాలి..? ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..

1 / 5
ముల్తానీ మట్టి వల్ల కలిగే ప్రయోజనాలు: ముల్తానీ మట్టిలో ఉండే సహజ గుణాలు స్కాల్ప్ (తలపై చర్మం) ను లోతుగా శుభ్రపరుస్తాయి. ఇది తలలో పేరుకుపోయిన అదనపు జిడ్డును, చెమటను, మురికిని పీల్చేసుకుంటుంది. దీనివల్ల జుట్టు కుదుళ్లు తెరుచుకుని, రక్తప్రసరణ మెరుగవుతుంది. ఫలితంగా జుట్టు రాలడం తగ్గి, కొత్త జుట్టు వేగంగా పెరుగుతుంది.

2 / 5
హెయిర్ టైప్‌ను బట్టి ఎలా ఉపయోగించాలి?: డ్రై హెయిర్ (పొడి జుట్టు) ఉన్నవారి కోసం ముల్తానీ మట్టి జుట్టును కాస్త పొడిగా మార్చే గుణం కలిగి ఉంటుంది. కాబట్టి, పొడి జుట్టు ఉన్నవారు ముల్తానీ మట్టి పొడిలో పెరుగు, కొబ్బరి నూనె లేదా పాలు కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. దీనిని జుట్టుకు రాసుకుని 15-20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇది జుట్టుకు మంచి కండిషనర్‌లా పనిచేస్తుంది.

3 / 5
ఆయిలీ హెయిర్ (జిడ్డు జుట్టు) ఉన్నవారి కోసం: తల ఎప్పుడూ జిడ్డుగా ఉండేవారు ముల్తానీ మట్టిలో రోజ్ వాటర్ (గులాబీ నీరు) లేదా కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ప్యాక్‌లా వేసుకోవాలి. ఇది తలలోని అదనపు సెబమ్ (నూనె) ఉత్పత్తిని నియంత్రిస్తుంది.

4 / 5
తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ముల్తానీ మట్టి ప్యాక్ వేసుకున్నప్పుడు అది జుట్టుపై పూర్తిగా ఎండిపోయేలా ఉంచకూడదు. కొద్దిగా తడిగా ఉన్నప్పుడే స్నానం చేయాలి, లేదంటే జుట్టు నుండి మట్టిని వదిలించడం కష్టమవుతుంది. వారానికి ఒకసారి ఈ పద్ధతిని పాటిస్తే, మీ జుట్టు ఎటువంటి కెమికల్స్ లేకుండానే పట్టుకుచ్చులా మెరిసిపోతుంది.

5 / 5
Follow Us
ఆర్టీసీ బస్సుల్లో వారికి ఫ్రీ జర్నీ.. ఏపీఎస్‌ఆర్టీసీ శుభవార్త..

ఆ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రాణం పెట్టాడు.. కానీ

గ్యాస్ లైటర్ మెరిసిపోతుంది.. సింపుల్‌గా ఇలా క్లీన్ చేస్తే చాలు..

అరెరె ఇంత ఈజీనా.. గుడ్డు మంచిదా.. కుళ్లిపోయిదా.. సెకన్లలో..

జామ్ అయిన కుక్కర్ విజిల్‌ను ఇలా సింపుల్‌గా క్లీన్ చేయండి.

మరీ ఎక్కువ అందంగా ఉందని సినిమాల్లో నుంచి తీసేశారు..

45 పైసలతో రూ.10 లక్షలు మీ అకౌంట్లోకి.. చేరడం మర్చిపొవద్దు..

ఇక మోసపోరు.. ఫ్రెష్ మటన్‌ను చిటికెలో ఇలా కనిపెట్టండి..

ఫ్రిజ్‌లో పెట్టినా బెండకాయలు నల్లగా మారుతున్నాయా? ఈ తప్పు చేయకండి

ముఖానికి నెయ్యి రాస్తే మొటిమలు వస్తాయా? డాక్టర్ల సలహా ఇదే!