ఇంట్లో తాబేలు విగ్రహం ఉంచితే అదృష్టం వస్తుందా? వాస్తు చెప్పే అసలు నిజం ఇదే!

25 May 2026

Rajashekher

హిందూమతంలో తాబేలుకు ప్రత్యేక స్థానం ఉంది. విష్ణుమూర్తి కూర్మావతారం కారణంగా దీనిని శుభప్రతీకంగా భావిస్తారు.

క్షీరసాగర మథన సమయంలో విష్ణువు తాబేలు రూపంలో మందర పర్వతాన్ని మోసినట్లు పురాణాల్లో పేర్కొంటారు. అందుకే తాబేలును కూర్మావతారంగా పూజిస్తారు. 

తాబేలును స్థిరత్వం, దీర్ఘాయువు, జ్ఞానం, సంపద,  అదృష్టానికి చిహ్నంగా పూజిస్తారు. అందుకే తాబేలును చాలా మంది తమ ఇళ్లలో పెట్టుకుంటారు. 

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో తాబేలు విగ్రహాన్ని ఉంచడం వల్ల సానుకూల శక్తి పెరిగి, ప్రతికూల శక్తులు తొలగిపోతాయని నమ్మకం.

ఉత్తర దిశలో తాబేలు విగ్రహం ఉంచితే ధనలాభం, ఉద్యోగంతోపాటు వ్యాపారంలో పురోగతి కలుగుతుందని చెబుతారు.

ఈశాన్య దిశలో తాబేలును ఉంచడం వల్ల ఇంట్లో శాంతి, ప్రశాంతత, ఆధ్యాత్మిక శక్తి పెరుగుతాయని విశ్వసిస్తారు.

నైరుతి దిశలో తాబేలు ఉంచితే కుటుంబ బంధాలు బలపడటంతో పాటు జీవితంలో స్థిరత్వం వస్తుందని భావిస్తారు. లోహం, స్ఫటికం, చెక్క, రాయి, మట్టి వంటి పదార్థాలతో చేసిన తాబేళ్లకు వాస్తులో వేర్వేరు దిశలను సూచిస్తారు. 

తాబేలు విగ్రహాన్ని నేరుగా నేలపై పెట్టకుండా, నీరు, రంగురంగుల రాళ్లతో ఉన్న పాత్రలో ఉంచితే మరింత శుభప్రదంగా భావిస్తారు.

నిజమైన తాబేలును పెంచాలంటే సరైన సంరక్షణ అవసరం. చూసుకోలేని పరిస్థితిలో లోహం లేదా బొమ్మ తాబేలును ఉంచడం మంచిదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.