AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aakaasam Nee Haddhu Ra: యూట్యూబ్ లో రికార్డ్ క్రియేట్ చేసిన సూర్య సాంగ్.. ‘కాటుక కనులే’ పాటకు భారీ వ్యూస్..

తమిళ్ స్టార్ హీరో సూర్యకు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాలో తమిళ్ తోపాటు తెలుగులోనూ విడుదలై మంచి విజయాలను అందుకుంటుంటాయి. దాంతో సూర్యకు ఇక్కడ కూడా ముచమంచి మార్కెట్ ఏర్పడింది.

Aakaasam Nee Haddhu Ra: యూట్యూబ్ లో రికార్డ్ క్రియేట్ చేసిన సూర్య సాంగ్.. 'కాటుక కనులే' పాటకు భారీ వ్యూస్..
Rajeev Rayala
|

Updated on: Jul 31, 2021 | 7:56 AM

Share

Aakaasam Nee Haddhu Ra: తమిళ్‌‌‌‌స్టార్ హీరో సూర్యకు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాలో తమిళ్ తోపాటు తెలుగులోనూ విడుదలై మంచి విజయాలను అందుకుంటుంటాయి. దాంతో సూర్యకు ఇక్కడ మంచి మార్కెట్ ఏర్పడింది. ఈ క్రమంలోనే త్వరలో ఓ స్ట్రయిట్ తెలుగు సినిమా చేయాలని చూస్తున్నాడు ఈ హీరో. ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో సూర్య సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాయి. చేసిన సినిమాలు వరుసగా నిరాశపరుస్తూ వచ్చాయి. ఈక్రమంలోనే లేడీ డైరెక్టర్ సుధా కొంగరు దర్శకత్వంలో వచ్చిన ఆకాశం నీహద్దురా సినిమా తిరిగి సూర్యను సక్సెస్ ట్రాక్‌‌‌‌‌లోకి తీసుకువచ్చింది. ఈమూవీలో సూర్య సరసన అపర్ణ బాలమురళి హీరోయిన్‌‌‌‌గా నటించింది. కరోనా కల్లోలం కారణంగా ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సిఖ్య ఎంటర్టైన్మెంట్స్ మరియు 2D ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై హీరో సూర్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎయిర్ డెక్కన్ అధినేత జీఆర్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా రూపొందించిన ఈ సినిమా ఓటీటీలో విడుదలై భారీ హిట్ అందుకున్న మొదటి సినిమాగా నిలిచింది. ఇక ఈ సినిమాలో జీవీ ప్రకాష్ అందించిన సంగీతం కూడా ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ముఖ్యంగా ‘కాటుక కనులే’ పాట తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంది.

తాజాగా ఈ పాట యూట్యూబ్‌‌‌‌‌లో రికార్డ్‌‌‌‌ను క్రియేట్ చేసింది. ‘కాటుక కనులే’ పాట యూట్యూబ్‌‌‌‌‌లో 100 మిలియన్స్  వ్యూస్ రాబట్టి రికార్డ్‌‌‌‌‌‌‌ను సృష్టించింది. ఒరిజినల్ తమిళ వెర్సన్ ‘కట్టు పాయలే’ సాంగ్ ఇప్పటి వరకు 63 మిలియన్ వ్యూస్ సాధించగా.. తెలుగులో మాత్రం ఈ పాట 100 మిలియన్స్ వ్యూస్ ను దక్కించుకుంది. సూర్యకు తెలుగులో ఎంత క్రేజ్ ఉందో ఈ పాట ఓ ఉదాహరణగా నిలిచిందని చెప్పుకోవచ్చు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Nithya Menon: పవన్‌ – రానా సినిమాలో నిత్యామీనన్‌.. పవన్‌కు భార్యగా నటించనున్న మలయాళం ముద్దుగుమ్మ.?

Rahul Sipligunj: రాహుల్ సిప్లిగంజ్ ఫన్నీ వీడియో.. వ్యక్తిపై నీళ్లు చల్లుతూ..

Anasuya: వెండితెరపై అనుసూయ హవా.. మరో సినిమాలో వినూత్నమైన పాత్రలో…

Follow Us
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!