AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonu Sood : బన్నీ కోసం బరిలోకి దిగనున్న సోనూసూద్.. ‘పుష్ప’లో నటించనున్న జులాయి విలన్.?

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పుష్ప సినిమాకోసం బన్నీ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోన్నారు. రంగస్థలం లాంటి భారీ విజయం తర్వాత సుకుమార్ తెరకెక్కిస్తోన్న సినిమా అలాగే ..అల వైకున్టపురంలో లాంటి..

Sonu Sood : బన్నీ కోసం బరిలోకి దిగనున్న సోనూసూద్.. 'పుష్ప'లో నటించనున్న జులాయి విలన్.?
Sonu Sood
Rajeev Rayala
|

Updated on: Jul 31, 2021 | 9:00 AM

Share

Pushpa movie : సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పుష్ప సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోన్నారు. రంగస్థలంలాంటి భారీ విజయం తర్వాత సుకుమార్ తెరకెక్కిస్తోన్న సినిమా అలాగే.. అల వైకుంఠపురంలో లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత అల్లు అర్జున్ నటిస్తోన్న సినిమా కావడంతో పుష్ప సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, పుష్పరాజ్ ఇంట్రడక్షన్ వీడియోకు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. మునుపెన్నడూ చేయని వైవిద్యపాత్రలో నటిస్తున్నాడు బన్నీ..  గంధపు చెక్కను నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు బన్నీ. ఈ సినిమా కోసం ఊర మాస్‌‌‌‌గా డీ గ్లామర్ లుక్‌‌‌‌లో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఇప్పటికే 80 శాతం వరకూ పూర్తయింది. ఇక ఈ సినిమాలో ముగ్గురు విలన్లు ఉండనున్నారని మొదటి నుంచి టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ఎంపికై షూటింగ్ లో జాయిన్ అయ్యారు. మరో విలన్ గా ఇప్పుడు కొత్త పేరు వినిపిస్తోంది.

పుష్ప సినిమాలో బన్నీతో రియల్ హీరో సోనూసూద్ తలపడనున్నారని టాక్ వినిపిస్తోంది. బన్నీకి ధీటైన విలన్‌‌‌‌గా సోనుసూద్‌‌‌ని ఎంపిక చేసినట్లు ప్రచారం సాగుతోంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌‌లో   జులాయి సినిమా వచ్చిన విషయం తెలిసిందే. రీసెంట్‌‌‌‌గా సోనుసూద్ ‘ఆచార్య’ షూటింగులో పాల్గొన్నాడు. అంతేకాదు వరుస బాలీవుడ్ సినిమాలతో ఆయన బిజీగా ఉన్నాడు. మరి పుష్ప సినిమాలో సోనూసూద్ నటిస్తున్నారా లేదా అన్నదానిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Aakaasam Nee Haddhu Ra: యూట్యూబ్ లో రికార్డ్ క్రియేట్ చేసిన సూర్య సాంగ్.. ‘కాటుక కనులే’ పాటకు భారీ వ్యూస్..

Allu Sirish : శరవేగంగా ‘ప్రేమ కాదంట’ మూవీ షూటింగ్.. డబ్బింగ్ కూడా మొదలుపెట్టేసిన అల్లు శిరీష్..

K. Raghavendra Rao: దర్శక విశిష్టుడు.. ఇప్పుడు ‘వశిష్ట’గా మారారు.. ఆడియన్స్‌కి న్యూ ఫీల్‌నివ్వడానికి రెడీ అయిన దర్శకేంద్రుడు

Follow Us
కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..
కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..
అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి
అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి
పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?
పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?
మలబద్దకాన్ని తరిమికొట్టే బోడ కాకరకాయ కారం.. ఎలా చేసుకోవాలంటే
మలబద్దకాన్ని తరిమికొట్టే బోడ కాకరకాయ కారం.. ఎలా చేసుకోవాలంటే
కృష్ణకు పోటీగా.. కేవలం రూ. 10 లక్షలతోనే సినిమా తీసి..
కృష్ణకు పోటీగా.. కేవలం రూ. 10 లక్షలతోనే సినిమా తీసి..
గుడ్డులోని పచ్చసొన రోజూ తింటే ఏమవుతుంది? నిపుణుల సూచన ఏంటంటే...
గుడ్డులోని పచ్చసొన రోజూ తింటే ఏమవుతుంది? నిపుణుల సూచన ఏంటంటే...
48 ఏళ్ల క్రితం MLA అయ్యాను..అయినా అలసిపోలేదు
48 ఏళ్ల క్రితం MLA అయ్యాను..అయినా అలసిపోలేదు
వేట్లపాలెం బాధితులకు అండగా ప్రభుత్వం.. భారీ పరిహారం ప్రకటన
వేట్లపాలెం బాధితులకు అండగా ప్రభుత్వం.. భారీ పరిహారం ప్రకటన
నాన్న లేకే ఇన్ని కష్టాలు! కానిస్టేబుల్ దివ్య సూసైడ్ నోట్ కలకలం!
నాన్న లేకే ఇన్ని కష్టాలు! కానిస్టేబుల్ దివ్య సూసైడ్ నోట్ కలకలం!
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్