Childhood Photo: నేను ధరించే దుస్తులు రేపు నా పిల్లలు చూసేలా ఉండాలి అన్న హీరోయిన్ చిన్ననాటి ఫోటో

Surya Kala

Surya Kala |

Updated on: Jul 31, 2021 | 2:59 PM

Childhood Photo: హైబ్రిడ్ పిల్ల‌..ఒక్క‌టే పీస్. సినిమాలో మాత్ర‌మే కాదు. బ‌య‌ట కూడా ఆ మాట నిజ‌మేనేమో అనిపిస్తుంది సాయి పల్లవిని చూస్తుంటే. ఆమెను చూస్తున్న‌ప్పుడ‌ల్లా..

Childhood Photo: నేను ధరించే దుస్తులు రేపు నా పిల్లలు చూసేలా ఉండాలి అన్న హీరోయిన్ చిన్ననాటి ఫోటో
Sai Pallavi

Childhood Photo: హైబ్రిడ్ పిల్ల‌..ఒక్క‌టే పీస్. సినిమాలో మాత్ర‌మే కాదు. బ‌య‌ట కూడా ఆ మాట నిజ‌మేనేమో అనిపిస్తుంది సాయి పల్లవిని చూస్తుంటే. ఆమెను చూస్తున్న‌ప్పుడ‌ల్లా పక్కింటి పిల్లలానే అనిపిస్తుంది. సహజంగా ఉంటూ అభిమానుల‌ను బుట్ట‌లో వేసుకుంటుంది. అయితే సాయి ప‌ల్ల‌విని బ‌య‌ట ఎప్పుడైనా చూడండి. చేతికి జ‌ప‌మాల‌​ క‌నిపి‌స్తుంటుంది. ఈ సహజనటి ప్రేమమ్ సినిమాతో వెండి తెరపై ఎంట్రీ ఇచ్చి… సెలక్టివ్ సినిమాల్లో నటిస్తూ వస్తుంది. సినిమా హిట్ ప్లాప్ టాక్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుంది.

చాలామంది యాక్టర్లు డాక్టర్ కాబోయే యాకర్ట్ అయ్యామని అంటారు. అయితే భానుమతి సింగిల్ పీస్ మాత్రం డాక్టర్ చదివి.. నటిగా వెండి తెరపై అడుగు పెట్టింది. సౌందర్య తరువాత గ్లామర్ తో కాకుండా తన నటనతో ఆకట్టుకుంది.. ఇప్పుడున్న నటీనటుల్లో సహజ నటిగా పేరు తెచ్చుకుంది సాయి పల్లవి. తల్లి బాటలో నడిచి చిన్నతనం నుంచి డ్యాన్స్ లో మంచి ప్రతిభ చూపే సాయిపల్లవి.. ఢీ డ్యాన్స్ షో లో పాల్గొంది. తన డ్యాన్స్ తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎనిమిదో తరగతి లో ఉండగా సాయిపల్లవి డ్యాన్స్ చూసిన ఓ దర్శకుడు ధూం ధాం అనే తమిళ సినిమాలో చిన్న పాత్రలో అవకాశమిచ్చాడు. తర్వాత మీరా జాస్మిన్ క్లాస్ మేట్ గా కస్తూరి మాన్ అనే మరో సినిమా లో నటించింది. డాక్టర్ చదివిన సాయి పల్లవి మలయాళంలో ప్రేమమ్ సినిమాతో హీరోయిన్ గా అడుగు పెట్టింది.

తనదైన శైలిలో ఆధ్యాత్మక ప్రవచనాలు నేటి తరంవారికి అర్ధమయ్యే రీతిలో గరికపాటి చెప్పే విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. తెలుగు భాషా సాంస్కృతిని అలాగే విషయం ఏదైనా సరే నేటితరానికి అర్థమయ్యేలా ఉండాలని బోధన చేస్తుంటారు ఆయన సాయి పల్లవి తాను ధరించే దుస్తుల పై మాట్లాడినప్పుడు గరికపాటి స్పందించారు. గతంలో సాయి పల్లవిపై కొన్ని పాజిటివ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. పొట్టి బట్టలు వేసుకోను, రేవు నా పిల్లలు కూడా నా సినిమా చూసేలా ఉండాలని సాయి పల్లవి తీసుకున్న నిర్ణయానికి గరికపాటి మెచ్చుకున్నారు. నా కూతురు లాంటి అమ్మాయి అని సాయిపల్లవిని ఆశీర్వదించారు.

Also Read: Crime News: బంగారం షాపులలో దొంగతనం చేస్తున్న మహిళా దొంగల ముఠా.. సినీ ఫక్కీలో పట్టుకున్న పోలీసులు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu