Crime News: బంగారం షాపుల్లో దొంగతనం చేస్తున్న మహిళా దొంగల ముఠా.. సినీ ఫక్కీలో పట్టుకున్న పోలీసులు

Crime News: మగవారి తో ఆడవారు అన్నింటా సమానమే అంటున్నారు. మంచితనం, మానవత్వం లోనే కాదు.. భర్తలు చంపుతున్న భార్యలు, కన్న ప్రేమను మరచి పిల్లల్ని..

Crime News: బంగారం షాపుల్లో దొంగతనం చేస్తున్న మహిళా దొంగల ముఠా.. సినీ ఫక్కీలో పట్టుకున్న పోలీసులు
Crime News
Follow us
Surya Kala

|

Updated on: Jul 31, 2021 | 1:07 PM

Crime News: మగవారి తో ఆడవారు అన్నింటా సమానమే అంటున్నారు. మంచితనం, మానవత్వం లోనే కాదు.. భర్తలు చంపుతున్న భార్యలు, కన్న ప్రేమను మరచి పిల్లల్ని చంపుతున్న తల్లులు, వెరైటీ దొంగతనాలు అన్నిటిలోనూ ఆధునిక మహిళ నేటి సమాజంలో తాము ఏమీ తక్కువ కాదు అని నిరూపిస్తున్నారు. తాజాగా ఓ దొంగ మహిళా దొంగల ముఠా జ్యూయలరీ షాప్ లో భారీ చోరీ కి ప్లాన్ చేసి అడ్డంగా దొరికిపోయిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

శ్రీకాకుళం జిల్లా రాజాంలో మహిళా దొంగల ముఠా హల్ చల్ చేసింది. ఈనెల 27 న సాయికిరణ్ జ్యూయలరీలో చోరీ చేసిన ఈ దొంగల ముఠా.. మళ్ళీ మరోసారి చోరీ కి ప్లాన్ చేశారు. అయితే అప్పటికే తన షాప్ లో దొంగతనం జరిగిందని జ్యూయలరీ షాప్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మహిళా దొంగల ముఠాను పట్టుకోవడానికి ప్లాన్ చేశారు. దొంగలను సినీ స్టైల్ లో వెంబడించి రాజాం పోలీసులు ముగ్గురిని పట్టుకున్నారు. మరో ముగ్గురు పోలీసులకు చిక్కకుండా పారిపోయారు. దీంతో వారిని పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

పారిపోయిన ముగ్గురు కారులో విశాఖ వైపు వెళ్తున్నట్లు గుర్తించారు. విశాఖ పోలీసులకు రాజాం పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో విశాఖ పోలీసులు సినీస్టైల్లో కారుతో సహాదొంగలను ట్రాక్ చేశారు. వారిని రాజాం పోలీసులకు అప్పగించారు. గత కొన్ని రోజులుగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో జ్యూయలరీ షాపులను టార్గెట్ చేసిన దొంగ ముఠా చోరీలు చేస్తుంది. ఈ ముఠా బంగారం షాపు లో రోల్డ్ గోల్డ్ బంగారం పెట్టి.. అసలు బంగారం ఎత్తుకెళ్తుంది. ఈ మహిళా దొంగల ముఠా ఖమ్మం జిల్లా మధిరకు చెందిన వారీగా గుర్తించారు.

Also Read:  నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారీ వేతనంతో ఉద్యోగాల భర్తీకి ఏపీ ట్రాన్స్‌కో నోటిఫికేషన్