Lal Darwaja Bonalu: వైభవంగా హైదరాబాద్ బోనాలు.. మ‌హంకాళి అమ్మవారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించిన మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి

హైదరాబాద్‌లో బోనాల వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఏ వీధిలో చూసినా బోనాల సందడే కనిపిస్తోంది. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న పాతబస్తీ లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి...

Lal Darwaja Bonalu: వైభవంగా హైదరాబాద్ బోనాలు.. మ‌హంకాళి అమ్మవారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించిన మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి
Lal Darwaza Bonalu 2021
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 01, 2021 | 1:53 PM

హైదరాబాద్‌లో బోనాల వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఏ వీధిలో చూసినా బోనాల సందడే కనిపిస్తోంది. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న పాతబస్తీ లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల వేడుకలు కన్నుల పండువలా సాగుతున్నాయి. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఆదివారం బోనాలు సమర్పించేందుకు భక్తులు పోటెత్తారు. గతేడాది కరోనా కారణంగా ఇళ్లకే పరిమితమైన భక్తులు.. ఇప్పుడు ఆలయానికి చేరుకుని బోనం సమర్పిస్తున్నారు.

వేడుకల్లో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ తొలి బోనం సమర్పించారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి. లాల్‌ దర్వాజ సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్న మంత్రి మహమూద్ అలీ.

భక్తిశ్రద్దలతో భక్తులు బోనం సమర్పించుకుంటున్నారని.. ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ప్రభుత్వ ఏర్పాట్లు చేసిందన్నారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లతో పాటు 3 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బోనాల సందర్భంగా పలుచోట్ల ట్రాఫిక్‌ మళ్లించారు. సోమవారం లాల్‌ దర్వాజ సింహవాహిని ఆలయంలో రంగంతో పాటు అంబారీ ఊరేగింపు కార్యక్రమాలు జరుగుతాయి.

ఇవి కూడా చదవండి: How to get a Kiss: ముద్దు ఎలా పెట్టుకోవాలో ఈ కుందేళ్ల నుంచి తెలుసుకోండి.. ఈ అందమైన వీడియో చూసిన తర్వాత మీరేమంటారు..

Viral Video: అమ్మో మాములుగా లేదే.. ఆటా.. పాటతో అత్తవారింట్లో దుమ్మురేపిన కొత్త కోడలు..