AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

How to get a Kiss: ముద్దు ఎలా పెట్టుకోవాలో ఈ కుందేళ్ల నుంచి తెలుసుకోండి.. ఈ అందమైన వీడియో చూసిన తర్వాత మీరేమంటారు..

Viral Video: ఎవరికైనా ప్రేమను వ్యక్తపరచడానికి ముద్దు మంచి మార్గం. ముద్దు పెట్టుకోవడం అనేది సన్నిహితంగా ఉండటమే కాకుండా సంబంధాన్ని బలపరుస్తుంది. మీరు...

How to get a Kiss: ముద్దు ఎలా పెట్టుకోవాలో ఈ కుందేళ్ల నుంచి తెలుసుకోండి.. ఈ అందమైన వీడియో చూసిన తర్వాత మీరేమంటారు..
Rabbits Kissing
Sanjay Kasula
|

Updated on: Aug 01, 2021 | 9:49 AM

Share

సోషల్ మీడియాలో వచ్చే పక్షులు, పాములు, జంతువుల వీడియోలు చాలా వైరల్ అవుతుంటాయి. అలాంటి చిత్రాలు, వీడియోలు మిలియన్ల కొద్ది వచ్చి పడుతుంటాయి. ఇలాంటివి పోస్ట్ చేసేందుకు  జంతు ప్రేమికులు తెగ ఇష్టపడుతుంటారు. అలాంటి ఫోటోలు, వీడియోలు చూస్తూ తమ సమయాన్ని సరదాగా  గడుపుతుంటారు. ఇంటర్నెట్‌లో జంతువులు ఎక్కువగా చూసే కంటెంట్‌లో ఒకటి అని చెప్పడం తప్పు లేదు. కొన్ని జంతువుల వీడియోలు చాలా ఫన్నీగా.. అందంగా ఉంటాయి. వాటిని చూసిన తర్వాత మీరు నవ్వడం ఆపుకోలేరు. అలాంటి రెండు కుందేళ్ల వీడియో ఈ రోజుల్లో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఇది మన ముఖంలో కూడా చిరునవ్వు తెప్పిస్తుంది.

ఎవరికైనా ప్రేమను వ్యక్తపరచడానికి ముద్దు మంచి మార్గం. ముద్దు పెట్టుకోవడం అనేది సన్నిహితంగా ఉండటమే కాకుండా సంబంధాన్ని బలపరుస్తుంది. మీరు మనుషులు ముద్దు పెట్టుకున్నప్పుడు చాలాసార్లు చూసి ఉంటారు. కానీ జంతువు ముద్దు పెట్టుకోవడం మీరు ఎప్పుడైనా చూసారా…? కాకపోతే కుందేళ్లు మద్దు పెట్టుకునే ఈ వీడియో మీ కోసం మాత్రమే…

ఈ వీడియోలో రెండు కుందేళ్లు కనిపిస్తాయి.  రెండూ ఒకదానికొకటి కొద్ది దూరంలో కూర్చుని ఉంటాయి. అప్పుడు ఒక కుందేలు తన భాగస్వామి వద్దకు వెళ్లడానికి ప్రయత్నిస్తుంది. కానీ అప్పుడు తన భాగస్వామి నుంచి ఎలాంటి స్పందన కనిపించదు. దీని తరువాత అది మళ్లీ ప్రయత్నింస్తుంది. ఈసారి మాత్రం సక్సెస్ అవుతుంది. అయితే అది చేసిన ప్రయత్నం.. ఎంత దూరం నుంచి ముద్దు పెట్టుకున్నది అనేదే ఈ వీడియోలో ప్రత్యేకత.

వైరల్ అవుతున్న ఈ వీడియో బుయిటెంజిబిడెన్ అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయబడింది. ఈ వీడియోకు పెట్టిన టైటిల్ కూడా అదిరిపోతోంది.  ‘ముద్దును ఎలా పొందాలి.. How to get a kiss’ అనే టైటిల్ జోడించారు. సోషల్ మీడియాలో ఈ అందమైన వీడియోను ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు. నెటిజన్లు దీనిని ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటున్నారు. అంతే కాకుండా దానిపై వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు. కుందేళ్ల ఈ అందమైన శృంగారాన్ని ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు.

ఇవి కూడా చదవండి: Telangana Cabinet: ఇవాళ తెలంగాణ కేబినెట్‌ సమావేశం..హుజురాబాద్‌ ఉప ఎన్నికపైనా ఫోకస్.. దళిత బంధు.. 50 వేల ఉద్యోగాలపై చర్చ

Chanakya Niti: ఈ అలవాట్లకు దూరంగా ఉంటే మీరు కోటీశ్వరులు కావచ్చు.. చాణక్యుడు చెప్పిన పెద్ద రహస్యం