NagarjunaSagar: సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదలకు సీఎం ఆదేశం.. ఈ సాయంత్రం తెరుచుకోనున్న నాగార్జునసాగర్ గేట్లు..
నాగార్జునసాగర్ జలాశయానికి వరద మరింత పెరిగింది. దీంతో నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల చేయాలని అధికారులను CM KCR ఆదేశించారు. AMRP నుంచి వెంటనే నీటిని విడుదల..
నాగార్జునసాగర్ జలాశయానికి వరద మరింత పెరిగింది. దీంతో నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల చేయాలని అధికారులను CM KCR ఆదేశించారు. AMRP నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలని CM KCR ఆదేశించినట్లు మంత్రి జగదీశ్ రెడ్డి వెల్లడించారు. ఆదివారం ఉదయం 6 గంటలకు.. 5 లక్షల 17 వేల 965 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదైంది. ఉదయం 5 గంటల వరకు 3 లక్షల 56 వేల 859 క్యూసెక్కులున్న ప్రవాహం.. మరో గంటకే భారీస్థాయిలో పెరిగింది.
జలాశయం 590 అడుగుల గరిష్ఠ నీటి మట్టానికి గాను 579.20 అడుగుల మేర నీకు ఉంది. 312.04 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి గాను 280.69 టీఎంసీల నీరు నిల్వ ఉంది. విద్యుదుత్పత్తి ద్వారా 36 వేల 543 క్యూసెక్కులు, ఎస్సెల్బీసీకి 12 వందల క్యూసెక్కులు మొత్తంగా.. 37 వేల 743 క్యూసెక్కులు దిగువకు వెళ్తోంది. నాగార్జునసాగర్ జలాశయం గేట్లు ఎత్తేందుకు అధికారుల సన్నద్ధమవుతున్నారు. ఎన్ఎస్పీ అధికారులు జలాశయం క్రస్ట్ గేట్లను పరిశీలించారు.
కృష్ణానదికి వస్తున్న వరదలతోపాటు తుంగభద్ర నీరు తోడవడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అక్కడ గేట్లు ఎత్తటంతో నాగార్జునసాగర్ నాలుగైదు రోజుల్లోనే జలకళతో తొణికిసలాడుతోంది. అయితే నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ వద్ద ఏటా క్రస్ట్ గేట్లను ఆగస్టు రెండో వారం లేదా ఆ తర్వాతి వారాల్లో ఎత్తుతారు. కానీ ఆ సంప్రదాయానికి భిన్నంగా ఈసారి ఆగస్టు తొలిరోజు నాడే నీటిని వదలాల్సిన పరిస్థితి ఏర్పడింది. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు ఇన్ ఫ్లో ఈ సీజన్లో జులై 28న మొదలైంది.
ఇవి కూడా చదవండి: How to get a Kiss: ముద్దు ఎలా పెట్టుకోవాలో ఈ కుందేళ్ల నుంచి తెలుసుకోండి.. ఈ అందమైన వీడియో చూసిన తర్వాత మీరేమంటారు..
Viral Video: అమ్మో మాములుగా లేదే.. ఆటా.. పాటతో అత్తవారింట్లో దుమ్మురేపిన కొత్త కోడలు..