AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Huzurabad: హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటలను ఢీ కొట్టబోయేది ఇతడే.. గులాబీ బాస్‌కు ఫుల్ క్లారిటీ.!

హుజురాబాద్ ఉప ఎన్నికలో అధికారపార్టీ టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు అన్నది దాదాపు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది...

Huzurabad: హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటలను ఢీ కొట్టబోయేది ఇతడే.. గులాబీ బాస్‌కు ఫుల్ క్లారిటీ.!
Cm Kcr
Venkata Narayana
|

Updated on: Aug 01, 2021 | 4:09 PM

Share

Huzurabad – KCR – TRS – Etela: హుజురాబాద్ ఉప ఎన్నికలో అధికారపార్టీ టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరన్నది దాదాపు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. టీడీపీ నుండి ఎల్ రమణ, కాంగ్రెస్ నుండి కౌశిక్, బీజేపీ నుండి పెద్దిరెడ్డి టీఆర్ఎస్ లో చేరడంతో ఈ ముగ్గురిలో ఒకరి ఈటెల రాజేందర్ ను ఢీకొట్టబోతున్నారు అనుకున్నారు అందరు.

అయితే ఇంత మందిని హుజురాబాద్ కోసం పార్టీలో చేర్చుకుంటే నియోజకవర్గంలో ఓవర్ లోడ్ అవ్వదా ఆనే చర్చ కూడా పార్టీలో జరిగింది. వీరందరి చేరికతో సొంత పార్టీలో ఆశావహులు అయిన గెల్లు శ్రీనివాస్, వకులబరణం కృష్ణ మోహన్ లాంటి నాయకులు కూడా కొంత ఆందోళనకు గురయ్యారు.

ఇతర పార్టీల నుండి హేమహేమి నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరినా.. బీజేపీ నుండి ఈటెల రాజేందర్ బీసీ నాయకుడు అవ్వడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్‌ఎస్ నుండి యువ బీసీ నాయకున్నే దింపాలనే ఫిక్స్ అయినట్టు టీఆర్‌ఎస్ వర్గాలు చెపుతున్నాయి. ముఖ్యంగా టీఆర్‌ఎస్ విద్యారి విభాగం అధ్యక్షుడు.. హుజురాబాద్ నియోజకవర్గం వినవంక మండలానికి చెందిన స్థానికుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ వైపు కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. గెల్లు శ్రీనివాస్ కూడా హుజురాబాద్ టిక్కెట్ కోసం అధిష్టానం దగ్గర గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాడు.

నాగార్జున సాగర్‌లో కూడా (నోముల భగత్) యువకుడికే ప్రాధాన్యత ఇచ్చిన కేసీఆర్.. ఇప్పుడు హుజురాబాద్‌లో కూడా గెల్లు శ్రీనివాస్‌కు అవకాశం ఇస్తే యువతను ప్రోత్సహించినట్టు అవుతుంది అనే ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది. దానికి తోడు యాదవ సామాజిక వర్గం నుండి కూడా గెల్లు శ్రీనివాస్‌కు మద్దతు వస్తుందని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. హుజురాబాద్‌లో యాదవ ఓటు బ్యాంకు 22 వేల150 ఉంది.

ఈటెల రాజేందర్..  లోకల్,  తాను లోకల్ అని చెప్పుకుంటున్న సమయంలో టీఆర్ఎస్‌లో కూడా హుజురాబాద్ నుండి స్థానిక నాయకులు పోటీలో ఉన్న విద్యార్థి నాయకుడిగా గెల్లుకు మంచి పట్టు ఉండటంతో దాదాపు గెల్లునే ఫైనల్ చేసినట్టు పార్టీ వర్గాల నుండి సమాచారం అందుతోంది.

Read also: Kakani: కృష్ణా జలాల వివాదంపై ఇద్దరు తెలుగు రాష్ట్రాల సీఎంలు కూర్చొని పరిష్కరించుకునే పరిస్థితి లేదు : కాకాణి