MLA Seethakka: కావాలనే అడ్డంకులు సృష్టిస్తున్నారు.. సంచలన ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే సీతక్క..
MLA Seethakka: ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ నిర్వహించతలపెట్టిన దళిత గిరిజన దండోరా బహిరంగ సభను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని..
MLA Seethakka: ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ నిర్వహించతలపెట్టిన దళిత గిరిజన దండోరా బహిరంగ సభను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. ఇంద్రవెల్లిలో నిర్వహించే సభ ఆదివాసీలకు వ్యతిరేకం కాదని ఆమె స్పష్టం చేశారు. ఆదివారం నాడు మీడియాతో మాట్లాడిన ఆమె.. కొంత మంది కావాలనే ఈ సభ కు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆదివాసీల హక్కుల కోసం దండోరా మోగించి తీరుతామని స్పష్టం చేశారు. దళిత గిరిజనుల సమస్యల పోరాటానికే దళిత గిరిజన దండోరా బహిరంగసభ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే సీతక్క స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళిత గిరిజనుల సమస్యలు పరిష్కరించడంలో విఫలం అయ్యాయని విమర్శలు గుప్పించారు.
ఉద్యమాల పురిటిగడ్డ ఇంద్రవెల్లి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని సీతక్క ప్రకటించారు. రాష్ట్రంలోని పొడు భూముల విషయంలో ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, దీనిపై కాంగ్రెస్ పోరాటం సాగిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని దళిత గిరిజనులు అంతా కాంగ్రెస్ వైపే ఉన్నారని, వారికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పోరాడుతూనే ఉంటుందని సీతక్క స్పష్టం చేశారు. ఇంద్రవెళ్లిలో నిర్వహించతలపెట్టిన దళిత గిరిజన దండోరా మహాసభకు ఆదివాసీ, గిరిజన, గిరిజనేతరులు భారీ సంఖ్యలో తరలి రావాలని ఎమ్మెల్యే సీతక్క పిలుపునిచ్చారు.
Also read:
AP Weather Alert: ఏపీలో పడమర గాలుల ఎఫెక్ట్.. రాగల మూడు రోజులపాటు వర్షాలు కురిసే ఛాన్స్..