Aadhaar Card: మీ ఆధార్ కార్డు పోగొట్టుకున్నారా..? ఒక్క ఎస్‌ఎంఎస్‌తో ఆధార్ నెంబర్‌ను లాక్ చేయవచ్చు… ఎలాగంటే..!
Aadhaar Number Lock: ఆధార్ కార్డు.. ఇది ప్రతి ఒక్కదానికి అవసరమే. ఆధార్ లేనిది ఏ పనులు జరగవు. బ్యాంకు అకౌంట్ దగ్గర నుంచి ప్రభుత్వ పథకాల వరకు అనేక సేవలు పొందేందుకు...
Aadhaar Number Lock: ఆధార్ కార్డు.. ఇది ప్రతి ఒక్కదానికి అవసరమే. ఆధార్ లేనిది ఏ పనులు జరగవు. బ్యాంకు అకౌంట్ దగ్గర నుంచి ప్రభుత్వ పథకాల వరకు అనేక సేవలు పొందేందుకు ఆధార్ కార్డు తప్పనిసరి. అయితే మీ ఆధార్ కార్డు ఎక్కడైన పోగొట్టుకున్నా.. నెంబర్ ఎవరికైనా తెలిసినా.. ఏదైనా మోసం జరుగుతుందేమోన్న బెంగ ఉంటుంది. మీ ఆధార్ కార్డు ఎక్కడైన పోతే మీరు వెంటనే మీ ఆధార్ నెంబర్‌ను లాక్ చేయవచ్చు. దీంతో మీ ఆధార్ ఎవరికైనా దొరికినా… ఒక వేళ నెంబర్ తెలిసినా.. ఎక్కడైనా ఉపయోగించుకోవాలంటే అస్సలు సాధ్యం కాదు. మళ్లీ మీరు కొత్త ఆధార్ కార్డ్ తీసుకునే వరకు నెంబర్‌ను లాక్ చేసి, కొత్త ఆధార్ కార్డు వచ్చిన తర్వాత అన్‌లాక్ చేయవచ్చు. ఇందు కోసం మీరు ఆధార్ కేంద్రం చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఒక్క ఎస్‌ఎంఎస్ పంపిస్తే చాలు ఆధార్ నెంబర్ లాక్ అయిపోతుంది. ఒక్క విషయం గుర్తించుకోవాలి. ఇలా లాక్ చేయాలనుకుంటే మీ ఆధార్‌కు మీ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. అయితే సాధ్యం అవుతుంది. మరీ మీ ఆధార్ నెంబర్‌ను ఎలా లాక్ చేయాలో తెలుసుకుందాం..
ఆధార్ నెంబర్ లాక్ చేయండి ఇలా
ఆధార్ నెంబర్ లాక్ చేయడానికి ముందు మీ రిజిస్టర్ మొబైల్‌లో GETOTP అని టైప్ చేయాలి. స్పేస్ ఇచ్చి ఆధార్ నెంబర్‌లోని చివరి 4 నెంబర్లను టైప్ చేయాలి. ఉదాహరణకు మీ ఆధార్ నెంబర్‌లో చివరి నాలుగు నెంబర్ 1234 అనుకుంటే మీరు GETOTP 1234 అని టైప్ చేసి 1947 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ ద్వారా 6 అంకెల ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత మరో ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది. ఇందుకోసం LOCKUID అని టైప్ చేయాలి. స్పేస్ ఇచ్చి మొదట ఆధార్ నెంబర్‌లో చివరి నాలుగు అంకెలు టైప్ చేయాలి. ఆ తర్వాత 6 అంకెల ఓటీపీ టైప్ చేయాలి. ఉదాహరణకు మీకు వచ్చిన ఓటీపీ 223355 అని ఉంటే GETOTP 1234 223355 అని టైప్ చేసి 1947 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపితే చాలు. మీ ఆధార్ నెంబర్ లాక్ అవుతుంది. ఇక మీ ఆధార్ నెంబర్‌ను ఆథెంటికేషన్ కోసం ఎవరూ వాడలేరు.
ఆధార్ నెంబర్ అన్‌లాక్ చేయడానికి కూడా పైన చెప్పినట్లుగానే ఎస్‌ఎంఎస్ పంపాల్సి ఉంటుంది. ఇందు కోసం ముందుగా వర్చువల్ ఐడీ క్రియేట్ చేయాలి. ఇందు కోసం RVID అని టైప్ చేసి ఆధార్ నెంబర్‌లోని చివరి 4 అంకెల్ని టైప్ చేసి 1947 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. మీరు వర్చువల్ ఐడీ వస్తుంది. ఆ తర్వాత GETOTP అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆధార్ నెంబర్‌లోని చివరి 4 నెంబర్లను టైప్ చేయాలి. ఓటీపీ జనరేట్ అవుతుంది. ఆ తర్వాత Unlocking UID అని టైప్ చేసి వర్చువల్ ఐడీలో చివరి 6 అంకెల్ని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఓటీపీ టైప్ చేసి 1947 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. మీ ఆధార్ నెంబర్ అన్‌లాక్ అవుతుంది. ఈ పద్దతుల ద్వారా ఆధార్ నెంబర్‌ను లాక్ చేయవచ్చు. అన్‌లాక్ చేయవచ్చు.