AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Driving Licence: స్మార్ట్‌ఫోన్‌లో డ్రైవింగ్‌ లైసెన్స్‌ డౌన్‌లోడ్‌ చేయండి… ఎలాగంటే..!

Driving Licence: వాహనం నడపాలంటే డ్రైవింగ్‌ లైసెన్స్‌ తప్పనిసరి. లైసెన్స్‌ లేకుండా వాహనం పడిపినట్లయితే జరిమానా తప్పనిసరి. ఇంకా కేసు కూడా నమోదవుతుంది. అయితే..

Driving Licence: స్మార్ట్‌ఫోన్‌లో డ్రైవింగ్‌ లైసెన్స్‌ డౌన్‌లోడ్‌ చేయండి... ఎలాగంటే..!
Driving Licence
Subhash Goud
|

Updated on: Apr 22, 2021 | 1:26 PM

Share

Driving Licence: వాహనం నడపాలంటే డ్రైవింగ్‌ లైసెన్స్‌ తప్పనిసరి. లైసెన్స్‌ లేకుండా వాహనం పడిపినట్లయితే జరిమానా తప్పనిసరి. ఇంకా కేసు కూడా నమోదవుతుంది. అయితే లైసెన్స్‌ తీసుకుంటే వాహనం నడిపే సమయంలో లైసెన్స్‌ కాపీ వాహనదారుడి వెంట ఉండాలి. గతంలో జేబులో లేదా వాహనంలోని క్యారీ చేయాల్సి వచ్చేది. అయితే టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఆ అవసరం లేకుండా పోయింది. స్మార్ట్‌ ఫోన్‌లో డ్రైవింగ్‌ లైసెన్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. డిజిటల్‌ పద్దతుల్లో డ్రైవింగ్‌లైసెన్స్‌, రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్స్‌ లాంటి కాపీలను చూపించవచ్చు. ఇందుకు అనుమతి కూడా ఉంది. డిజీలాకర్ లేదా ఎంపరివాహన్ యాప్‌లో వీటిని డౌన్‌లోడ్ చేసుకొని సాఫ్ట్ కాపీ స్మార్ట్‌ఫోన్‌లో భద్రంగా దాచుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో ఇవి ఉంటే మీరు ప్రత్యేకంగా ఫిజికల్ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. వాహనదారులకు ఈ సమస్య ఉండకూడదనే ప్రభుత్వం డిజిటల్ కాపీలను అనుమతిస్తున్నాయి.

డిజీలాకర్‌లో మీ డ్రైవింగ్ లైసెన్స్ డౌన్‌లోడ్ చేయడానికి ముందుగా రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం మీ ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్ తప్పనిసరి. ఆ తర్వాత మీ యూజర్ నేమ్, ఆరు అంకెల పిన్ ద్వారా లాగిన్ కావాలి. మీ రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయాలి. సైన్ ఇన్ అయిన తర్వాత మీ ఆధార్ నెంబర్‌ను డిజీలాకర్‌కు లింక్ చేయాల్సి ఉంటుంది. లింక్ చేసిన తర్వాత Get Issued Documents పైన క్లిక్ చేయాలి. అందులో డ్రైవింగ్ లైసెన్స్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీరు డ్రైవింగ్ లైసెన్స్ ఏ రాష్ట్రంలో తీసుకుంటే ఆ రాష్ట్రానికి చెందిన రవాణా శాఖకు సంబంధించిన లింక్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు నమోదు చేసి Get Document పైన క్లిక్ చేయాలి.

అయితే రవాణా శాఖ సర్వర్ నుంచి మీ డ్రైవింగ్ లైసెన్స్ డాక్యుమెంట్ మీ డిజీలాకర్ అకౌంట్‌లోకి వస్తుంది. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ సాఫ్ట్ కాపీని కూడా మీరు ఇక్కడి నుంచే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే మీరు డిజీలాకర్ యాప్ ఉపయోగించకూడదు అనుకుంటే mParivahan యాప్ ద్వారా కూడా డ్రైవింగ్ లైసెన్స్ సాఫ్ట్ కాపీ పొందొచ్చు. ప్రాసెస్ దాదాపు ఇదే విధంగా ఉంటుంది.

ఇవీ చదవండి: Flipkart Delivery : ఫ్లిప్‌కార్ట్‌ కీలక నిర్ణయం… ఆర్డర్‌ చేసిన గంటన్నరలో ప్రొడక్ట్‌ డెలివరీ.. ప్రస్తుతం ఏయే నగరాల్లో అంటే..!

Public Provident Fund Scheme: పీపీఎఫ్‌ స్కీమ్‌లో చేరితే రూ.10 లక్షలు సంపాదించవచ్చు… ఎలాగంటే..!