- Telugu News Photo Gallery Viral photos Corona second wave death troll is raising abnormally throught india photos about the situation in various states
Corona Pandemic: కరోనా మరణమృదంగం..దేశవ్యాప్తంగా మరణాల కల్లోలం! హృదయాన్ని ద్రవింప చేసే దృశ్యాలు
కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలో దేశంలో నెలకొని ఉన్న పరిస్థితులెలా ఉన్నాయో చెప్పే ఫోటోలు ఇవి.
Updated on: Apr 22, 2021 | 1:44 PM

ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లో ప్రతి కోవిడ్ ఆసుపత్రిలో రోజూ 10 నుంచి 20 మంది మరణిస్తున్నారు.

ఇది భోపాల్ భద్భదా శ్మశానవాటిక వద్ద పరిస్థితి. ప్రతిరోజూ ఇక్కడ 100-150 మంది దహన సంస్కారాలు జరుగుతున్నాయి

ఇది బెంగళూరు బోమన్హాలి ఘాట్లో.. ప్రతిరోజూ ఇక్కడ 100-200 మంది అంత్యక్రియలు జరుగుతున్నాయి. అక్కడికి మృతదేహాలను తీసుకువచ్చిన అంబులెన్స్ ల క్యూ ఇది.

వారణాసిలో ఒక తల్లి తన చిన్న కొడుకు వైద్యం కోసం ఆసుపత్రులు తిరిగుతూనే ఉంది. కానీ..అతనికి చికిత్స దొరకలేదు. తల్లి పాదాల వద్దే ప్రాణాలు విడిచాడు.

జమ్మూ జిల్లా ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్యా 123 శాతం పెరిగింది. మృత దేహాలను తరలించేందుకు అంబులెన్స్ లు చాలక ఒక అంబులెన్స్ లో 5-8 మృత దేహాలను తరలిస్తున్నారు.

ఈ ఫోటో కథనం ఎవరినీ భయపెట్టే ఉద్దేశ్యంతో చెబుతున్నది కాదు. కేవలం పరిస్థితి వివరించడం కోసమే. అందరూ కోవిడ్ నుంచి సురక్షితంగా ఉండాలనేదే మా ఆకాంక్ష



