నాలుగు రోజుల్లో పెళ్లి.. పెళ్లికార్డు ఇవ్వడానికి వెళ్లిన తండ్రికి ఊహించని షాక్.. అసలేం జరిగిందంటే!
అల్లారుముద్దుగా పెంచిన కూతురికి పెళ్లి కుదిరిందని ఆ తల్లిదండ్రులు తెగ సంబరపడిపోయారు. నాలుగు రోజుల్లో వివాహం జరగనుండటంతో.. పెళ్లి పనుల్లో..
అల్లారుముద్దుగా పెంచిన కూతురికి పెళ్లి కుదిరిందని ఆ తల్లిదండ్రులు తెగ సంబరపడిపోయారు. నాలుగు రోజుల్లో వివాహం జరగనుండటంతో.. పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. బంధువులకు పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళిన ఆ తండ్రికి చిరునవ్వుతో కనిపించిన కూతురు.. గంటల వ్యవధిలోనే రోడ్డు పక్కన శవంగా కనిపించడంతో గుండె పగిలింది. ఆయన్ని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాలేదు. ప్రేమించి.. పెళ్లాడబొతున్నవాడే ఇంతటి దారుణానికి ఒడిగట్టడం విషాదకరం. ఈ హృదయవిదారక ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
బరేలీకి చెందిన మీనాక్షి, జితన్‌లు ఇద్దరూ ప్రేమించుకున్నారు. వీరి వివాహానికి పెద్దలు కూడా అంగీకరించారు. ఈ నెల 20వ తేదీన వివాహం. వివాహానికి తక్కువ రోజులే సమయం ఉండటంతో మీనాక్షి తండ్రి మదన్‌పాల్ సింగ్ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం బంధువులకు పెళ్లి కార్డు ఇచ్చేందుకు బయల్దేరగా.. మొరాదాబాద్ కుర్‌ద్వారా ప్రాంతంలో అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు మీనాక్షి శవమై కనిపించడంతో మదన్‌పాల్ అక్కడే కుప్పకూలిపోయాడు. చిరునవ్వుతో సాగరంపిన కూతురు.. ఇలా శవంగా కనిపించడంతో ఆ తండ్రి గుండె పగిలేలా రోదించాడు. అతడ్ని కంట్రోల్ చేయడం ఎవరికి సాధ్యపడలేదు.
అసలేం జరిగిందంటే..
ఇంటి నుంచి మదన్‌పాల్ బయటికి వెళ్లగానే.. మీనాక్షిని షాపింగ్‌కు వెళ్దాం అంటూ జితిన్ బయటికి రమ్మని పిలిచాడు. తనకి ఈ పెళ్లి ఇష్టం లేదని.. వివాహాన్ని ఆపాలని మీనాక్షిని కోరాడు. అందుకు మీనాక్షి అంగీకరించకపోవడంతో.. ఆగ్రహించిన జితిన్ ఆమెను దారుణంగా హతమార్చాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి జితిన్‌ను అరెస్ట్ చేశారు.
Also Read:
ఉదయాన్నే టిఫిన్ తిని స్నానం చేస్తున్నారా? అయితే జాగ్రత్త! ఈ విషయాలు తెలుసుకోండి
కారు ఇంజిన్ నుంచి వింత శబ్దాలు.. బోనెట్ తెరిచి చూడగా ఫ్యూజులు ఔట్.!
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీమిండియా జట్టు ఇదే.. ఆ ప్లేయర్‌కు మరోసారి నిరాశ.. కోహ్లీపై విమర్శలు.!
అత్తింటి మర్యాదా మజాకా.. కొత్త కోడలికి మెట్టు మెట్టుకో గిఫ్ట్.. వైరల్ అవుతున్న వీడియో..