Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: కారు ఇంజిన్ నుంచి వింత శబ్దాలు.. బోనెట్ తెరిచి చూడగా ఫ్యూజులు ఔట్.!

ప్రపంచం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఎక్కడ చూసినా అడవులను నరికేస్తున్నారు. ఇళ్లను కట్టేస్తున్నారు. ఇలా జంతువులకు తమ నివాసాన్ని..

Viral News: కారు ఇంజిన్ నుంచి వింత శబ్దాలు.. బోనెట్ తెరిచి చూడగా ఫ్యూజులు ఔట్.!
Strange Noise
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 15, 2021 | 8:10 PM

ప్రపంచం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఎక్కడ చూసినా అడవులను నరికేస్తున్నారు. ఇళ్లను కట్టేస్తున్నారు. ఇలా జంతువులకు తమ నివాసాన్ని దూరం చేస్తుండటంతో.. అవి తరచూ జనావాస ప్రాంతాలకు వచ్చిన సందర్భాలు కోకోల్లలు. ఇదిలా ఉంటే కొన్నిసార్లు మనుషులు వల్ల తమకు హాని కలగకూడదనే ఉద్దేశంతో జంతువులు ఊహకు అందని ప్రదేశాల్లో దాక్కుంటాయి. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి స్కాట్‌ల్యాండ్‌లో చోటు చేసుకుంది.

ఆ వివరాలు.. స్కాట్‌ల్యాండ్‌లోని ఎడిన్‌బుర్గ్‌లో ఓ మహిళ పార్క్ చేసిన తన కారును స్టార్ట్ చేద్దామని ప్రయత్నించగా.. ఇంజిన్ నుంచి వింత శబ్దాలు రావడం మొదలయ్యాయి. అసలు ఆ శబ్దాలు ఎక్కడ నుంచి వస్తున్నాయని.. ఆ మహిళ కారు బోనెట్ ఓపెన్ చేసి చూడగా.. ఊహించని షాక్ తగిలింది. ఎలుక జాతికి చెందిన ఓ బీవర్ కారు ఇంజిన్ దగ్గర దాక్కుని ఉండటం చూసి ఆ మహిళ బిగ్గరగా అరవడంతో చుట్టుప్రక్కల వారు అధికారులకు విషయాన్ని తెలిపారు. కాగా, యానిమల్ రెస్క్యూవర్స్ అక్కడికి చేరుకొని బీవర్‌ను ఇంజిన్ దగ్గర నుంచి సురక్షితంగా బయటికి తీశారు. దీనితో ఆ మహిళ ఊపిరి పీల్చుకుంది.

Also Read:

ఈ పాత రూ. 2 నాణెంతో లక్షలు సంపాదించవచ్చు.? ఎలాగో మీరే తెలుసుకోండి.!

అత్తింటి మర్యాదా మజాకా.. కొత్త కోడలికి మెట్టు మెట్టుకో గిఫ్ట్‌.. వైరల్ అవుతున్న వీడియో..

జగన్ సర్కార్ సంచలనం.. ఇకపై ఇంగ్లీష్ మీడియంలోనే డిగ్రీ కోర్సులు.. ఉత్తర్వులు జారీ

 కుండలో నీరు తాగుతున్నారా? అయితే ఈ సూపర్ బెనిఫిట్స్ గురించి తెలుసుకోండి!