Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Old Coins: ఈ పాత రూ. 2 నాణెంతో లక్షలు సంపాదించవచ్చు.? ఎలాగో మీరే తెలుసుకోండి.!

కొంతమందికి పాత నాణేలను, వస్తువులను, స్టాంపులను సేకరించే అలవాటు ఉంటుంది. అలాగే మరి కొంతమందికి అయితే తాము భద్రపరుచుకున్న..

Old Coins: ఈ పాత రూ. 2 నాణెంతో లక్షలు సంపాదించవచ్చు.? ఎలాగో మీరే తెలుసుకోండి.!
Two Ruppess
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 15, 2021 | 7:10 PM

కొంతమందికి పాత నాణేలను, వస్తువులను, స్టాంపులను సేకరించే అలవాటు ఉంటుంది. అలాగే మరి కొంతమందికి అయితే తాము భద్రపరుచుకున్న పాత నోట్లను ఈ-కామర్స్ సైట్లలో అమ్మకానికి పెడుతుంటారు. ఇలాంటి పాత నాణేలను అమ్మడానికి చాలానే వెబ్‌సైట్స్ ఆన్లైన్‌లో ఉన్నాయి. ఇక ఇప్పుడు అలాంటి పాత నాణేలు, నోట్లు గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. మీ దగ్గర 1994, 1995, 1997, 2000 సంవత్సరాలకు చెందిన రూ. 2 నాణెం ఉంటే మీరు లక్షాధికారి అయినట్లే.!

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బెంగళూరుకు చెందిన క్విక్కర్ వెబ్‌సైట్‌లో ఈ పాత, అరుదైన నాణేలకు భారీ మొత్తాన్ని చెల్లించడానికి చాలామంది కొనుగోలుదారులు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియదు గానీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్.

ఇదిలా ఉంటే పాత ఫీచర్లతో ఉన్న రూ. 10 నోటును ఆన్‌లైన్‌లో కాయిన్‌బజార్ వెబ్‌సైట్‌లో అమ్మవచ్చునని.. ఈ పాత నోట్లకు కొనుగోలుదారులు వేలల్లో చెల్లిస్తున్నారని వినికిడి. 1943లో జారీ చేసిన ఆ పది రూపాయల నోట్‌పై ఒక వైపు అశోక స్తంభం, మరో వైపు పడవ ఉంటాయి. అలాగే అప్పటి ఆర్‌బీఐ గవర్నర్ సీడీ దేశ్‌ముఖ్ సంతకం, ఆంగ్ల భాషలో నోట్ రెండు చివర్లలో.. వెనుక వైపున 10 రూపాయలని రాసి ఉంటుంది.

Also Read:

అత్తింటి మర్యాదా మజాకా.. కొత్త కోడలికి మెట్టు మెట్టుకో గిఫ్ట్‌.. వైరల్ అవుతున్న వీడియో..

జగన్ సర్కార్ సంచలనం.. ఇకపై ఇంగ్లీష్ మీడియంలోనే డిగ్రీ కోర్సులు.. ఉత్తర్వులు జారీ

 కుండలో నీరు తాగుతున్నారా? అయితే ఈ సూపర్ బెనిఫిట్స్ గురించి తెలుసుకోండి!