YS Jagan: జగన్ సర్కార్ సంచలనం.. ఇకపై ఇంగ్లీష్ మీడియంలోనే డిగ్రీ కోర్సులు.. ఉత్తర్వులు జారీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే తాజాగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల..

YS Jagan: జగన్ సర్కార్ సంచలనం.. ఇకపై ఇంగ్లీష్ మీడియంలోనే డిగ్రీ కోర్సులు.. ఉత్తర్వులు జారీ
Jagan
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 15, 2021 | 7:09 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే తాజాగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఉన్నత విద్యామండలి తాజాగా కీలక ప్రకటన చేసింది. ఇకపై రాష్ట్రంలోని డిగ్రీ కోర్సులన్నీ కూడా ఇంగ్లీష్ మాధ్యమంలోనే అమలు కానున్నాయి.

”ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కాలేజీలు డిగ్రీ కోర్సులను ఇంగ్లీష్ మీడియంలోనే అందించాలని.. అన్ని ప్రైవేటు ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ కాలేజీలు తెలుగులో అమలు చేస్తున్న కోర్సులను ఇంగ్లీష్ మీడియంలోకి మార్చుకోవాలని” ఉన్నత విద్యామండలి సూచించింది. 2021-22 విద్యా సంవత్సరం నుంచి ఈ రూల్స్ వర్తిస్తాయని తెలిపింది.

లాంగ్వేజ్ కోర్సులు మినహాయించి.. మిగిలిన విభాగాల కోర్సులను ఇంగ్లీష్ మీడియంలోకి మార్చుకునేందుకు ఈ నెల 18 నుంచి 28లోగా ప్రతిపాదనలు పంపాలని సూచించింది. గడువులోపు సమర్పించకపోతే.. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆయా కోర్సుల నిర్వహణకు అనుమతులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. అటు అన్ ఎయిడెడ్ ప్రోగ్రామ్స్‌లో సాధ్యం కాని, నిర్వహించని యూజీ కోర్సులను ఉపసంహరించుకోవాలనుకునే ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీలు, ప్రైవేట్‌ ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీలు ఈ నెల 18 నుంచి 28 మధ్య తమ ప్రతిపాదనలు సమర్పించాలని ఉన్నత విద్యామండలి సూచించింది.

కాగా, కొత్త విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ కాలేజీలు అన్నీ కూడా ఇంగ్లీష్‌ మీడియంలోనే కోర్సులను అందించాలని ఫిబ్రవరి 12వ తేదీన సీఎం వైఎస్ జగన్ ఉన్నత విద్యపై నిర్వహించిన సమీక్షలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

Also Read:

ఈ పాత రూ. 2 నాణెంతో లక్షలు సంపాదించవచ్చు.? ఎలాగో మీరే తెలుసుకోండి.!

అత్తింటి మర్యాదా మజాకా.. కొత్త కోడలికి మెట్టు మెట్టుకో గిఫ్ట్‌.. వైరల్ అవుతున్న వీడియో..

కుండలో నీరు తాగుతున్నారా? అయితే ఈ సూపర్ బెనిఫిట్స్ గురించి తెలుసుకోండి!

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే