Actor Ali: సినీ నటుడు అలీ ఆశ ఈసారైనా నెరవేరుతుందా?.. సీఎం వైఎస్ జగన్ ఆలోచన ఎలా ఉంది?.. ఇంట్రస్టింగ్ స్టోరీ మీకోసం..
Actor Ali: సినీ నటుడు అలీ ఆశ ఈసారైనా నెరవేరుతుందా?.. అలీ కోరుకున్న స్థానం రాజకీయాల్లో దక్కుతుందా.. ఇంతకీ ఈ మెగా కమిడియన్ పొలిటికల్...
Actor Ali: సినీ నటుడు అలీ ఆశ ఈసారైనా నెరవేరుతుందా?.. అలీ కోరుకున్న స్థానం రాజకీయాల్లో దక్కుతుందా.. ఇంతకీ ఈ మెగా కమిడియన్ పొలిటికల్ గా ఆశిస్తోంది ఏంటి? ఇంట్రస్టింగ్ స్టోరీ.. మీకోసం.. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు టీవీషోలు చేస్తూ ఇటు వెండితెర, అటు బుల్లితెర ప్రేక్షకులను కనువిందు చేస్తున్నారు అలీ. ఈ రెండే కాకుండా రాజకీయ రంగంలోనూ సత్తా చాటి తన ప్రత్యేకత చూపించాలని ఆరాట పడ్డారు అలీ. కానీ అది అందని ద్రాక్ష గానే ఇప్పుడువరకు ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీ పార్టీలో చేరిన అలీకి ఏదో ఒక నామినేటెడ్ పదవి వస్తుందని అంతా అనుకున్నారు. వైసీపీ బంపర్ మెజారిటీతో గెలుపొందిన తర్వాత అలీ రాజకీయ కార్యకలాపాలతో బిజీ అవుతాడని ప్రచారం జరిగింది. జగన్ అధికారంలోకి వచ్చారు కాబట్టి అలీకి నామినేటెడ్ పోస్ట్ ఖాయం అని టాక్ నడించింది. కానీ ఇంత వరకు ఆ ఊసేలేదు.
ఆంధ్రప్రేదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తరువాత సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పలువురికి.. పలు కీలక పదవులు కట్టబెట్టారు. నటుడు పృధ్వీకి ఎస్వీబీసీ చైర్మన్ పదవి ఇచ్చారు(ఇప్పుడు తొలగించారు). ఆ తరువాత విజయ్ చందర్‌ను ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు. దివంగత నాయకుడు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మిపర్వతి కి తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్ పదవి ఇచ్చారు. ఇక సినీ పరిశ్రమకు చెంది, ఎంతోకాలంగా రాజకీయాల్లో రాణిస్తున్న వైసీపీ ఎమ్మెల్సీ రోజాకు ఏపీఐఐసీ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారు.
కాగా, సీఎం జగన్ నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తున్నారనే వార్తలు వస్తున్న ప్రతిసారీ.. తెలుగు సినిమాకు సంబంధించి పలువురి పేర్లు ప్రధానంగా తెరపైకి వస్తున్నాయి. అందులో మంచు మోహన్ బాబు, ఆలీ, జీవితా రాజశేఖర్, పోసాని కృష్ణమురళి వంటి వారు కూడా ఉన్నా.. పదవుల విషయంలో అలీ పేరే ఎక్కువగా వినిపిస్తుంది. వైసీపీ అధికారంలోకి వచ్చి రెండు ఏళ్ళు గడుస్తున్నా అలీకి ఏ పదవి రాకపోవడంతో ఈ సారి ఏదో ఒక పదవి దక్కించుకోవాలి అని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఆట ఈ మెగా కమిడియన్.
ఇది ఇలా ఉంటే సినిమాల పరంగా మంచి సక్సెస్‌లో ఉండగా వైసీపీ పార్టీలో చేరటంతో తనకి చాలా నష్టం జరిగిందని వైసీపీ పెద్దలు వద్ద వాపోయారట అలీ. అప్పట్లో తన మిత్రుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా, వైసీపీ కి మద్దతుగా మాట్లాడటం ఇప్పుడు శాపంగా మారింది అని వైసీపీ పెద్దల వద్ద తన గోడు వెల్లబోసుకున్నారట. తనకు ఎమ్మెల్సీ కానీ ఏదో ఒక కీలక పదవి ఇవ్వాలని వైసీపీ అధిష్టానాన్ని అలీ కోరారట. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో ప్రభుత్వ సలహాదారు, పార్టీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి తన మనుసలోని మాటని చెప్పారు అలీ. ఎమ్మెల్సీ కానీ, ఎమ్మెల్సీ కుదరని పక్షంలో ఏదో ఒక నామినేటెడ్ పదవి ఉర్దూ అకాడమీ చైర్మన్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్, వక్ఫ్ బోర్డు, హజ్ కమిటీ చైర్మన్ పోస్ట్ లలో ఏదో ఒక పదవి ఇవ్వాలి అని అడిగారట అలీ. కాగా, పదవి వస్తుందని ఇన్నాళ్లు ఓపిక పట్టిన అలీ.. ఇక తన మనుసులోని మాటను పార్టీ అధిష్టానం ముందు పెట్టారు. మరి సీఎం జగన్ ఈ సారైనా అలీ కోరికను నెరవేరుస్తారో లేదో చూడాలి.
Also read:
YS Sharmila Tour: నల్లగొండ జిల్లాలో పర్యటించనున్న వైఎస్ షర్మిల.. షెడ్యూల్ వివరాలు ఇవే..