AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon update: మరో మూడు రోజులపాటు తెలంగాణలో తేలికపాటి వర్షాలు.. కోస్తా, సీమ జిల్లాల్లో మోస్తారు వానలు..

తెలుగు రాష్ట్రాల్లో వర్షాకాలం మొదలైంది. నైరుతి రుతపవనాలు దేశ వ్యాప్తంగా ప్రవేశించడంతో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో విస్తారంగా వానలు పడుతున్నాయి.

Monsoon update: మరో మూడు రోజులపాటు తెలంగాణలో తేలికపాటి వర్షాలు.. కోస్తా, సీమ జిల్లాల్లో మోస్తారు వానలు..
Monsoons
Sanjay Kasula
|

Updated on: Jun 15, 2021 | 4:05 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో వర్షాకాలం మొదలైంది. నైరుతి రుతపవనాలు దేశ వ్యాప్తంగా ప్రవేశించడంతో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో విస్తారంగా వానలు పడుతున్నాయి. రాగల మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, దీంతో మంగళవారం,  బుధవారం రాష్ట్రంలోని ఒకటి రెండు ప్రాంతాల్లో  ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందన్నారు. మంగళవారం, బుధవారాల్లోకూడా తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

మరోవైపు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం రాత్రి తీరం దాటి ఝార్ఖండ్‌పైకి చేరుకుంది. ఇదిప్పుడు తెలంగాణ వైపునకు తిరిగి ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో తెలంగాణలో మంగళవారం, బుధవారం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉరుములు, మెరుపులతోపాటు ఓ మాదిరి వర్షాలు కురుస్తాయని, రాష్ట్రంలో రెండ్రోజుల పాటు అక్కడక్కడ గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో గాలులతో కూడిన వర్షం పడనున్నట్టు వెల్లడించింది.

ఇదిలావుంటే, అల్పపీడనం, నైరుతి రుతుపవనాల వల్ల రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. వాయవ్య బంగాళాఖాతం, దాని పక్కనే ఉన్న ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌ తీరాలపై అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది.

దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఎత్తులో నైరుతి దిశగా తిరిగి ఉంది. ఇది పడమర దిశగా ప్రయాణించొచ్చు. వీటి ప్రభావంతో రానున్న 48 గంటల్లో కోస్తాంధ్రలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని, రాయలసీమలో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి వానలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం  తెలిపింది.

ఇవి కూడా చదవండి : Modi Cabinet Expansion Buzz: త్వరలో కేంద్ర కేబినెట్‌లోకి పవన్ కళ్యాణ్..! వేగంగా మారుతున్న ఢిల్లీ రాజకీయాలు..!

VHP : అయోధ్య శ్రీరామాలయానికి సమర్పించిన ప్రతి రూపాయికి ట్రస్టు జవాబుదారిగా ఉంటుంది : అలోక్ కుమార్