AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆర్టీసీ బస్సులో లగేజీ మర్చిపోయారా…? ఆందోళన చెందకుండా ఇలా చేస్తే తిరిగి పొందవచ్చు..!

RTC Bus Luggage Recovery: ఆర్టీసీలో ప్రయాణిస్తున్నప్పుడు ఏదో ఒక సమయంలో మనం వస్తువులను మర్చిపోవడం సహజం. ల్యాప్‌టాప్, డబ్బు, విలువైన పత్రాలు వంటి సామాగ్రిని బస్సులో మర్చిపోతుంటాం. ముఖ్యంగా చివరి సమయంలో బస్సు దిగుతున్నప్పుడు లేదా ఏదో ఆలోచనలో ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. అయితే, ఆర్టీసీ అధికారులు చెబుతున్నట్లుగా చేస్తే.. సరైన విధంగా ప్రాసెస్ ఫాలో అయితే మీ సామాగ్రిని తిరిగి పొందడం చాలా సులభం.

ఆర్టీసీ బస్సులో లగేజీ మర్చిపోయారా...? ఆందోళన చెందకుండా ఇలా చేస్తే తిరిగి పొందవచ్చు..!
Ap Tg Rtc
Rajashekher G
|

Updated on: Feb 24, 2026 | 3:48 PM

Share

చాలా మంది ప్రజలు నిత్యం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. అలాంటి ప్రయాణాల్లో కొందరు ఎప్పుడో ఒకప్పుడు తమ సొంత వస్తువులు, ల్యాప్‌టాప్, డబ్బు, విలువైన పత్రాలు వంటి సామాగ్రిని బస్సులో మర్చిపోతుంటారు. ముఖ్యంగా చివరి సమయంలో బస్సు దిగుతున్నప్పుడు లేదా ఏదో ఆలోచనలో ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. అయితే, ఆర్టీసీ అధికారులు చెబుతున్నట్లుగా చేస్తే.. సరైన విధంగా ప్రాసెస్ ఫాలో అయితే మీ సామాగ్రిని తిరిగి పొందడం చాలా సులభం.

1. టికెట్ ఉన్నట్లయితే:

ముందుగా మీ దగ్గర బస్ టికెట్ ఉందో లేదో చూడండి. టికెట్ ఉంటే, అందులో డ్రైవర్ లేదా కండక్టర్ ఐడీ ఉంటుంది. కొన్నిసార్లు కేవలం కండక్టర్ ఐడీ మాత్రమే ఉంటుంది. టికెట్ మీద ఉన్న ఐడీ నంబర్‌ను నోట్ చేసుకోండి.

ఆ తర్వాత మీరు ప్రయాణించిన బస్సు ఏ ఆర్టీసీకి చెందినదో గుర్తించండి:

APS RTC బస్సు: 0866 2570005 లేదా 149 (టోల్ ఫ్రీ) తెలంగాణ RTC బస్సు: 040-69440000 కాల్ చేసి.. మీ లగేజీ మర్చిపోయిన విషయం స్పష్టంగా చెప్పాలి. వారు అడిగిన ఐడీ నంబర్ ఇవ్వగానే, ఆ బస్సులో కండక్టర్/డ్రైవర్‌కు సంబంధించిన ఫోన్ నంబర్ మీకు అందజేస్తారు.

ఆ నంబర్‌కు కాల్ చేసి, ఎక్కడి సీటు వద్ద సామాగ్రి మర్చిపోయిందో చెప్పాలి. సామాగ్రి బస్సులోనే ఉంటే, భద్రంగా మీకు అప్పగిస్తారు. లేదా, దగ్గరలో ఉన్న బస్టాండ్‌లో ఉంచి అక్కడి నుంచి మీరు పొందవచ్చు.

2. టికెట్ లేకపోతే:

బస్ టికెట్ లేకపోతే, మర్చిపోయిన సామాగ్రి ఎవరూ తీసుకెళ్ళకపోతే, అది డిపోకు చేరుస్తారు. బస్ డిపో సెక్యూరిటీ సిబ్బంది విధులు ముగిశాక బస్సును చెక్ చేసి మర్చిపోయిన వస్తువులను రికార్డులోకి ఎంటర్ చేస్తారు. మీరు డిపోకు చేరుకుని వివరాలు చెబితే, మేనేజర్ సమక్షంలో చెక్ చేసి లగేజీని తిరిగి అందిస్తారు.

ముఖ్యమైన సలహాలు:

ఎప్పుడైనా బస్సులో వస్తువులు మర్చిపోతే, టికెట్ లేదా డిపోలో సంప్రదించడం ద్వారా సులభంగా పొందవచ్చు. ముఖ్యంగా విలువైన వస్తువులు ఉంటే, వెంటనే ఫోన్ చేసి ప్రాపర్ ప్రాసెస్ ఫాలో చేయడం ద్వారా మీ వస్తువులను తిరిగి పొందే అవకాశం ఉంటుంది.

Follow Us