Vijayasai Reddy : చంద్రబాబు అందుకే విశాఖ రాజధానిని వ్యతిరేకిస్తున్నారు : విజయసాయి రెడ్డి

కిందటి ఎన్నికల్లో గెలుపు అసాధ్యమని బాబుకు తెలుసు. విజయం సాధించే మార్గం చూపించే వారెవరైనా దొరికితే వెయ్యి కోట్లయినా వెదజల్లేవాడు. అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ స్కామ్ లోనే 5 లక్షల కోట్లు వస్తాయని ఆశించాడు.

Vijayasai Reddy : చంద్రబాబు అందుకే విశాఖ రాజధానిని వ్యతిరేకిస్తున్నారు : విజయసాయి రెడ్డి
Vijayasai Reddy
Follow us
Venkata Narayana

|

Updated on: Jun 15, 2021 | 5:37 PM

YSRCP MP Vijayasai reddy : భూ ఆక్రమణలు బయటపడతాయనే టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ రాజధానిని వ్యతిరేకిస్తున్నారని వైయ‌స్ఆర్ సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఆరోపించారు. తన బంధువుకు చెందిన గీతం, పల్లా, చిన్న పెద్దా నాయకులంతా వేల కోట్ల విలువైన భూములను చెరబట్టారు.. విశాఖ రాజధాని అయితే అధికార పీఠం అక్కడే ఉండి కుంభకోణాలను వెలికి తీస్తుందని చంద్రబాబు భయపడ్డాడు. అంటూ విజయసాయి వ్యాఖ్యానించారు. పనిలో పనిగా టీడీపీ నేతలు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ గత ఎన్నికల్లో సాయం చేసేందుకు ముందుగా టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారని తాజాగా చేస్తున్న కామెంట్ల మీద విజయసాయి రియాక్టయ్యారు.

“కిందటి ఎన్నికల్లో గెలుపు అసాధ్యమని బాబుకు తెలుసు. విజయం సాధించే మార్గం చూపించే వారెవరైనా దొరికితే వెయ్యి కోట్లయినా వెదజల్లేవాడు. అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ స్కామ్ లోనే 5 లక్షల కోట్లు వస్తాయని ఆశించాడు. ఈ కథలన్నీ తెలిసి వ్యూహకర్తగా సేవలందించడానికి ఎవరు అంగీకరిస్తారు?” అంటూ తనదైన శైలిలో ఎద్దేవా చేశారు వైసీపీ ఎంపీ.

“ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్యకు వల వేస్తే పడలేదు. ఇప్పుడు సోనూ సూద్ కు గాలం వేశాడు. నిస్వార్థ సేవా కార్యక్రమాలతో ఆయన సంపాదించుకున్న మంచి పేరులో ఎంతో కొంత కొట్టేయొచ్చన్నది బాబు ప్లాన్. త్వరలోనే వీళ్ల సంగతి ఆయనకు తెలియక పోదు. ఇమేజి పెంచుకోవడానికి అడ్డదారులుండవు బాబూ.” అంటూ చంద్రబాబు మీద మరోసారి ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు విజయసాయి.

Read also : VHP : అయోధ్య శ్రీరామాలయానికి సమర్పించిన ప్రతి రూపాయికి ట్రస్టు జవాబుదారిగా ఉంటుంది : అలోక్ కుమార్

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే