Brahma Kamal Flower: విశాఖ జిల్లా డౌనూరు గ్రామంలో వికశించిన బ్రహ్మకమలం.. ప్రత్యేక పూజలు చేసిన గ్రామస్థులు
విశాఖ జిల్లా కొయ్యూరు మండలం డౌనూరు గ్రామంలో బోనంగి ప్రసాద్ మాస్టారు ఇంటిలో బ్రహ్మకమలం విరబూసింది. దీంతో మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు.
విశాఖ జిల్లా కొయ్యూరు మండలం డౌనూరు గ్రామంలో బోనంగి ప్రసాద్ మాస్టారు ఇంటిలో బ్రహ్మకమలం విరబూసింది. దీంతో మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఎంతో అరుదుగా సంవత్సరంకు ఒక్కసారి మాత్రమే బ్రహ్మకమలం పుష్పం వికశిస్తుంది. అది తమ గ్రామంలో వికసించడంతో ఆనందోత్సాహాలతో, ఎంతో భక్తి శ్రద్ధలతో స్థానికులు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాస్టర్ సతీమణి సత్యవతి మాట్లాడుతూ తమ ఇంటిలో బ్రహ్మకమలం పూయడం చాలా ఆనందంగా ఉందన్నావిశాఖ జిల్లా కొయ్యూరు మండలం డౌనూరు గ్రామంలో బోనంగి ప్రసాద్ మాస్టారు ఇంటిలో బ్రహ్మకమలం విరబూసింది. దీంతో మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. మూడు సంవత్సరాలు క్రితం ఇంటి పెరట్లో మొక్క నాటామన్నారు. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో బ్రహ్మకమలం విరబూసిందని చెప్పారు.
బ్రహ్మ కమలం అంటే బ్రహ్మ కూర్చునే పువ్వు. హైందవ సంప్రదాయంలో దీనికి చాలా విశిష్ఠత ఉంది. ఈ పుష్పం మన జనారణ్యంలో తక్కువగా కనిపిస్తుంది. దీన్ని పెంచే వారు కూడా చాలా తక్కువ. హిమాలయాల్లో దొరికే ఈ మొక్క ఇంట్లో ఉంటే మంచిదని హిందువులు భావిస్తారు. కొన్ని గంటలు మాత్రమే వికసించే ఈ అందమైన పుష్పాన్ని చూసేందుకు జనాలు కూడా పెద్ద సంఖ్యలో వస్తుంటారు.
Also Read: దొంగతనానికి వచ్చి ఎంచక్కా బాత్రూమ్‌లో జలకాలాడాడు.. కట్ చేస్తే