Eating Breakfast After Bath: ఉదయాన్నే టిఫిన్ తిని స్నానం చేస్తున్నారా? అయితే జాగ్రత్త! ఈ విషయాలు తెలుసుకోండి
ఉద్యోగ ఒత్తిడి, ఆర్ధిక భారాలు, ఇతరత్రా కారణాల వల్ల ఈ మధ్యకాలంలో మనిషి ఉదయం నుంచి రాత్రి వరకు ఓ మిషన్‌లా పని చేస్తూనే ఉంటున్నాడు..
ఉద్యోగ ఒత్తిడి, ఆర్ధిక భారాలు, ఇతరత్రా కారణాల వల్ల ఈ మధ్యకాలంలో మనిషి ఉదయం నుంచి రాత్రి వరకు ఓ మిషన్‌లా పని చేస్తూనే ఉంటున్నాడు. ఇలాంటప్పుడు ఆరోగ్యకరంగా ఉండాలంటే.. ప్రతీ ఒక్కరూ కూడా ఉదయాన్నే పౌష్టిక విలువలు నిండిన అల్పాహారాన్ని తీసుకోవాలని వైద్యు నిపుణులు చెబుతుంటారు. ఇక మనం తీసుకునే టిఫిన్.. మన ఆలోచనా తీరును మార్చేస్తుందని వారు అంటున్నారు. ఇదిలా ఉంటే కొంతమందికి అల్పాహారం తీసుకున్నాక స్నానం చేయడం అలవాటు. అయితే అలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలెన్నో వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అల్పాహారం తీసుకున్న తర్వాత స్నానం చేస్తే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుందని.. ఆ ప్రభావం జీర్ణవ్యవస్థపై పడుతుందని డాక్టర్లు తెలిపారు. దాని ఫలితంగా వాంతులు, అల్సర్, అసిడిటీ వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని అన్నారు. అంతేకాదు ఊబకాయానికి కూడా కారణం అవుతుందన్నారు. కాగా, స్నానం చేసిన తర్వాత అల్పాహారం తీసుకుంటే మెదడు చురుగ్గా పని చేసి.. ఎంత ఆహారం తీసుకుంటున్నామో సరిగ్గా అంచనా వేస్తుందని వైద్యులు చెప్పారు. అందుకే స్నానం తర్వాతే అల్పాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు.
Also Read:
ఈ పాత రూ. 2 నాణెంతో లక్షలు సంపాదించవచ్చు.? ఎలాగో మీరే తెలుసుకోండి.!
అత్తింటి మర్యాదా మజాకా.. కొత్త కోడలికి మెట్టు మెట్టుకో గిఫ్ట్.. వైరల్ అవుతున్న వీడియో..
జగన్ సర్కార్ సంచలనం.. ఇకపై ఇంగ్లీష్ మీడియంలోనే డిగ్రీ కోర్సులు.. ఉత్తర్వులు జారీ
కుండలో నీరు తాగుతున్నారా? అయితే ఈ సూపర్ బెనిఫిట్స్ గురించి తెలుసుకోండి!