Monsoon Recipes: వర్షాకాలంలో ఈ బెస్ట్ స్నాక్స్ సులభంగా ఇంట్లోనే చేసుకోని ఎంజాయ్ చేయండి..
వర్షాకాలం ప్రారంభమైంది.. దేశవ్యాప్తంగా రుతపవనాలతో గత కొన్ని రోజులుగా వర్షాలు ఏకధాటిగా కురుస్తున్నాయి. లాక్ డౌన్ కారణంగా ఎంతో మంది ఇంట్లో చేస్తున్నవారికి
వర్షాకాలం ప్రారంభమైంది.. దేశవ్యాప్తంగా రుతపవనాలతో గత కొన్ని రోజులుగా వర్షాలు ఏకధాటిగా కురుస్తున్నాయి. లాక్ డౌన్ కారణంగా ఎంతో మంది ఇంట్లో చేస్తున్నవారికి ఈ రెయిన్ సీజన్ లో రుచికరమైన స్నాక్స్ చేసి పెట్టండి. ఇంట్లోనే ఆరోగ్యకరమైన స్నాక్స్ రెడీ చేసుకోండిలా. అవెంటో తెలుసుకుందామా.
మొక్కజొన్న భెల్.. వర్షకాలంలో మొక్కజొన్నలు పుష్కలంగా లభిస్తాయి. వీటితోపాటు చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమోటా ముక్కలు, నిమ్మరసం, కొత్తిమీర కలిపి క్రంచీ పకోడిలా మాదిరిగా తయారు చేసుకోండిలా. వీటిని పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి పచ్చడితో సర్వ్ చేసుకోవాలి.
ఆలూ పన్నీర్ టిక్కీ.. ఆలూ పన్నీర్ టిక్కీ వర్షకాలంలో మంచి స్నాక్. ఉడికించిన బంగాళాదుంపలు, పన్నీర్, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆసాఫోటిడా కలిపి చేసుకోవాలి. వీటిని టెస్టీ డ్రింక్ తో తీసుకోవడం మంచిది.
చీజ్ బచ్చలి కూర సమోసా.. సమోసాలు వర్షాకాలంలో ఎక్కువగా తీసుకునే స్నాక్. బచ్చలికూర, పన్నీర్, జున్ను, ఉప్పు, వెల్లుల్లి బ్రెడ్ మసాలా, అల్లం, పచ్చిమిర్చి, పిండి, నూనె, వెల్లుల్లి అవసరం పడతాయి.
వాడా పావ్.. దీనిని ముంబైలో ఎక్కువగా చేసుకుంటారు. బంగాళా దుంపలు, వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, పసుపు, శనగ పిండి, మిరపపొడి, నీరు, నూనె, పావ్, కరివేపాకు, వెన్న కలిపి చేసుకోవాలి. వీటిని పచ్చిమిర్చి పచ్చడితో కలిపి తీసుకుంటే రుచిగా ఉంటాయి.
డోబెలి.. పావ్, వెన్న, మసాలా వేరుశనగ, బంగాళాదుంపలు, టమోటాలు, పచ్చిమిర్చి, అల్లం కలిపి చేసుకోవచ్చు. వీటిని టీ లేదా కాఫీతో కలిపి తీసుకోవచ్చు.