Lemon Peels: రక్తపోటును, చర్మ సమస్యలను తగ్గించడమే కాకుండా.. గుండె ఆరోగ్యానికి మేలు చేసే నిమ్మ తొక్కలను ఎలా ఉపయోగించాలో తెలుసా..
Lemon Peels Benefits: నిమ్మకాయ ఎన్నో అనారోగ్య సమస్యలను నివారించడమే కాకుండా.. చర్మానికి కూడా మేలు చేస్తుంది.
Lemon Peels Benefits: నిమ్మకాయ ఎన్నో అనారోగ్య సమస్యలను నివారించడమే కాకుండా.. చర్మానికి కూడా మేలు చేస్తుంది. ఇందులో రోగ నిరోధక శక్తిని పెంచే పోషకాలతోపాటు.. విటమిన్ సి అధికంగా ఉంటుంది. అయితే మనం కేవలం నిమ్మకాయ రసం మాత్రమే ఉపయోగించి తొక్కలను బయటపడేస్తుంటాం. కానీ ఆ తొక్కలతో కూడా అనేక రకాల ప్రయోజనాలున్నాయని మీకు తెలుసా..
నిమ్మరసంలో కంటే.. వాటి తొక్కలలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి చర్మానికి మేలు చేస్తుంది. ఇందులో 126 మి.గ్రా. విటమిన్ సి ఉంటుంది. కానీ రసంలో కేవలం 53 మి.గ్రా ఉంటుంది. అలాగే తొక్కలో 134 మి.గ్రా. కాల్షియం ఉంటుంది. రసంలో కేవలం 26 మి.గ్రా ఉంటుంది. ఇక నిమ్మరసంలో 138 మి.గ్రా పొటాషియం ఉండగా, దాని చర్మంలో 169 మి.గ్రా. 2.8 కిలోలు ఉంటుంది. నిమ్మరసంలో అదే మొత్తంలో ఫైబర్ ఉండగా, దాని చర్మంలో 10 గ్రాముల ఫైబర్ ఉంటుంది. అలాగే, అంతర్జాతీయ విటమిన్ కొలత ప్రకారం, 50 IU పోషకాలు ఉన్నాయి.
నిమ్మకాయ తొక్కలలో కెరోటినాయిడ్లు విటమిన్ ఏ గా మారి కళ్లకు మంచి చేస్తాయి. అలాగే ఇందులో ఉండే.. విటమిన్ సి వృద్ధులకు కంటి సమస్యలను తగ్గిస్తుంది. ఈ నిమ్మకాయ తొక్కలను గాయాలకు వాడుతుంటారు. ఎందుకంటే.. ఇది బ్యాక్టీరియా వ్యాప్తిచెందకుండా చేస్తుంది. ఇందులో సిట్రిక్ యాసిడ్ ఉన్నందున.. మధుమేహ రోగుల చికిత్సకు వాడుతుంటారు. శరీరం నుంచి ఏర్పడే దుర్వాసనను నిమ్మ తొక్కలు తొలగిస్తాయి. అలాగే మొటమలను కూడా తగ్గిస్తాయి. వీటిని పూదీనాతో ఉడకబెట్టి ముఖంపై అప్లై చేయడం మేలు.
ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉన్నందున మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. అలాగే బరువును అదుపులో ఉంచుతాయి. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం రక్తనాళాలను సడలించి.. రక్తపోటును స్థిరంగా ఉంచడానికి సహాయపడతాయి. అలాగే ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు చెడు కొలెస్ట్రాల్ ఎల్‌డీఎల్‌ను తగ్గించడమే కాకుండా.. గుండె ఆరోగ్యానికి సహయపడతాయి. అలేగా ఇవి చర్మ క్యాన్సర్ రాకుండా చేస్తాయి. నిమ్మకాయలోని లెమోన్‌గ్రాస్ ఒక అద్భుతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. క్యాన్సర్, శరీర అవయవాలు, కణాలను ప్రభావితం చేసే వ్యాధుల నుండి మనలను కాపాడుతుంది. ఎముకలను బలంగా ఉంచుతాయి. అలాగే ఇందులో ఉండే. విటమిన్ సి దంత సమస్యలను తొలగిస్తాయి.
Also Read: RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ చివరి షూటింగ్‌కు టైం ఫిక్స్.. ఎప్పటినుంచి అంటే..