AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ చివరి షూటింగ్‏కు టైం ఫిక్స్.. ఎప్పటినుంచి అంటే..

RRR Movie:  యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ బడ్జెట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్.

RRR Movie: 'ఆర్ఆర్ఆర్' చివరి షూటింగ్‏కు టైం ఫిక్స్.. ఎప్పటినుంచి అంటే..
Rrr Movie
Rajitha Chanti
|

Updated on: Jun 15, 2021 | 3:35 PM

Share

RRR Movie:  యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ బడ్జెట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పై మొదటి నుంచి అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇందులో హీరోయిన్లుగా అలియా భట్, ఒవిలియా మోరీస్ నటిస్తుండగా.. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరిదశలో ఉంది. బాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖ సెలబ్రెటీలు ఈ సినిమాలో కీలక పాత్రలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.  ఇదిలా ఉంటే.. ఆర్ఆర్ఆర్ చివరి షెడ్యూల్ లో కీలకమైన రెండు పాటలతోపాటు.. మరిన్ని యాక్షన్ సన్నివేశాలను కూడా చిత్రీకరించబోతున్నారు. దాదాపుగా 8 నుంచి 10 వారాలపాటు కంటిన్యూగా షూటింగ్ జరిపి.. సినిమాను ముగించాలని చూస్తున్నాడట జక్కన్న. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా నిలిచిపోయింది.

తాజాగా సమాచారం ప్రకారం ఈ మూవీ షూటింగ్ జూలై మొదటి వారంలోనే ప్రారంభించాలని చూస్తున్నాడట రాజమౌలి.. అటు దేశంలో కరోనా కేసులు తగ్గుతుండడంతో రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలను ప్రభుత్వం సడలింపు ఇచ్చింది. దీంతో పలు సినిమా షూటింగ్స్ పునఃప్రారంభం అయ్యాయి. ఇక అతి కొద్ది మందితోనే షూటింగ్ ప్రారంభించాలని చూస్తున్నారట మేకర్స్. అందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా మొదలు పెట్టారట. ఇప్పటికే హీరోలు ఇద్దరితో పాటు సినిమాలో నటిస్తున్న కీలక నటీనటులు మరియు సాంకేతిక నిపుణులకు కూడా జులై మొదటి వారం నుండి షూటింగ్ కు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పాడట జక్కన్న. మరి రాజమౌళి అనుకున్న సమయానికే ప్లాన్ చేస్తారో లేదో చూడాలి.

Also Read:  Pranahita-Godavari Basin : ప్రాణహిత-గోదావరి బేసిన్‌‌కు సరికొత్త చరిత్ర.. 240 మిలియన్ ఏళ్ల నాటి జీవజాతిని గుర్తించిన ఐఎస్‌ఐ..

Newly Wed Couple dies: సౌతాఫ్రికాలో విషాదం.. పెళ్లైన వారం రోజులకే భారత సంతతి నవ దంపతులు మృతి!

Koratala Shiva: కొరటాల శివ బర్త్ డే.. అరుదైన ఫోటో షేర్ చేసిన రామ్ చరణ్.. ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్..